అంతర్జాతీయ మ్యాచ్లో తొలి సెంచరీ..విజయంపై స్పందించిన సంజూ శాంసన్..!

దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా( India vs South Africa ) మధ్య జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ను భారత్ 2-1 తేడాతో సొంతం చేసుకుంది.తాజాగా జరిగిన మూడవ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది.

 First Century In An International Match Sanju Samson Reacts To The Victory , San-TeluguStop.com

భారత జట్టు బ్యాటర్ సంజూ శాంసన్( Sanju Samson ) 114 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 108 పరుగులు చేశాడు.తిలక్ వర్మ( Tilak Verma ) 52 పరుగులతో రాణించాడు.

రింకూ సింగ్ సింగ్ 38 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.

సంజూ శాంసన్ కు ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ( First international century ) కావడం విశేషం.

అద్భుత ఇన్నింగ్స్ ఆడిన సంజూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.సంజూ శాంసన్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని, తన ఆట ప్రదర్శన వల్ల తాను సంతోషంగా ఉన్నాడని తెలిపాడు.

Telugu India Africa, Sanju Samson, Tilak Verma-Sports News క్రీడలు

గత కొంతకాలంగా తాను పడుతున్న కష్టానికి తగ్గ ఫలితం ఈరోజు దక్కడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు.టీ20 ఫార్మాట్ కు, వన్డే ఫార్మాట్ కు కాస్త తేడా ఉందని, వన్డే ఫార్మాట్ లో పిచ్ ను అర్థం చేసుకోవడానికి కొంత సమయం ఉంటుంది.టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ కు వస్తే క్రీజ్ లో సెట్ అవ్వాలంటే 10 నుంచి 20 బంతుల వరకు సమయం తీసుకోవచ్చు.

కాస్త దూకుడుగా ఆడకుండా పిచ్ ను అర్థం చేసుకుని ఆ తర్వాత రాణించడానికి ప్రయత్నించినట్లు తెలిపాడు.

Telugu India Africa, Sanju Samson, Tilak Verma-Sports News క్రీడలు

ఇక తిలక్ వర్మ అద్భుత ఆట ప్రదర్శన గురించి ఎంత చెప్పుకున్న తక్కువేనని, తిలక్ వర్మ ఆట తీరు చాలా బాగుందని, భవిష్యత్తులో తిలక్ వర్మ నుంచి అద్భుతమైన మంచి ఇన్నింగ్స్ వస్తాయని చెప్పుకొచ్చాడు.ఇక తాజాగా జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టు 45.5 ఓవర్లలో అన్ని వికెట్లను కోల్పోయి 218 పరుగులు చేసి 78 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది.భారత జట్టు పేసర్ అర్షదీప్ సింగ్ నాలుగు వికెట్లు తీసి దక్షిణాఫ్రికా బ్యాటర్లను అద్భుతంగా కట్టడి చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube