YCP Candidates : రేపు వైసీపీ అభ్యర్థుల తుది జాబితా ప్రకటన..!!

ఏపీలో రాజకీయ వేడి కొనసాగుతోంది.ఇప్పటికే పలు విడతల్లో అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ రేపు తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది.

 Final List Of Ycp Candidates Announced Tomorrow-TeluguStop.com

ఈ మేరకు వైఎస్ఆర్ జిల్లాలోని ఇడుపులపాయకు వెళ్లనున్న పార్టీ అధినేత, సీఎం జగన్( CM Jagan ) అభ్యర్థుల లిస్టును ప్రకటించనున్నారు.మధ్యాహ్నం ఒంటి గంటకు రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ మరియు 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థులను సీఎం జగన్ ప్రకటిస్తారు.

తరువాత ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించనున్నారు.అలాగే ఈ నెల 18వ తేదీన శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నుంచి ఎన్నికల ప్రచారాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు.అదే రోజు నెల్లూరు రూరల్ తో పాటు విజయవాడ( Vijayawada ) వెస్ట్ లోనూ పర్యటించనున్నారు.ఈ తరహాలో రోజుకు రెండు లేదా మూడు నియోజకవర్గాల్లో పర్యటించి బహిరంగ సభలు, రోడ్ షోల్లో పాల్గొననున్నారు.

ఇందుకోసం పార్టీ నేతలు ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధం చేశారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube