Surya Kiran Sujitha : అన్న మృతిపై చెల్లెలు సుజిత ఎమోషనల్ పోస్ట్.. మరో జన్మ ఉంటే కలలు సాకారం కావాలంటూ?

తెలుగులో సత్యం సినిమాతో సక్సెస్ సాధించి దర్శకుడు సూర్యకిరణ్( Surya Kiran ) అభిమానులకు దగ్గరయ్యారు.జాండీస్, గుండె సంబంధిత సమస్యల వల్ల సూర్యకిరణ్ మృతి చెందారని తెలుస్తోంది.

 Sujitha Emotional Comments Goes Viral In Social Media Details Here-TeluguStop.com

మార్చి నెల 11వ తేదీన సూర్యకిరణ్ కన్నుమూశారు.చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరిగాయి.

సినిమా రంగానికి చెందిన ప్రముఖలు ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.సూర్యకిరణ్ మృతి గురించి ఆయన సోదరి సుజిత మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

సూర్యకిరణ్ అంటే చాలా ఇష్టమని సుజిత గతంలో పలు సందర్భాల్లో వెల్లడించారు.సూర్యకిరణ్ సైతం సుజితపై చాలా సందర్భాల్లో ప్రేమను చూపించారు.సూర్యకిరణ్ లేడనే వార్తను తట్టుకోలేకపోతున్నానని చెబుతూ సుజిత ఎమోషనల్ అయ్యారు.సూర్యకిరణ్ నా అన్నయ్య మాత్రమే కాదని నా హీరో నా తండ్రి కూడా అని సుజిత( sujitha ) చెప్పుకొచ్చారు.

ఇండస్ట్రీలో సూర్యకిరణ్ టాలెంట్ కు, సూర్యకిరణ్ మాటలకు నేను ఎప్పుడూ అభిమానినేనని సుజిత కామెంట్లు చేశారు.

మరో జన్మంటూ ఉంటే అప్పుడైనా అన్నయ్య కలలన్నీ సాకారం కావాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని సుజిత పేర్కొన్నారు.సుజిత వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.సుజిత ప్రస్తుతం సీరియల్స్ తో బిజీగా ఉన్నారు.

బాల్యంలోనే తండ్రిని కోల్పోవడంతో నాన్నలా తమ కుటుంబాన్ని సూర్యకిరణ్ పోషించారని సుజిత పలు సందర్భాల్లో పేర్కొన్నారు.సుజిత ప్రస్తుతం హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యారని తెలుస్తోంది.

సుజిత ఇన్ స్టాగ్రామ్ ద్వారా అన్నయ్యతో అనుబంధాన్ని పంచుకున్నారు.సుజిత షేర్ చేసిన పోస్ట్ కు 27 వేల లైక్స్ వచ్చాయి.

సుజిత కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.సుజిత రెమ్యునరేషన్ ఒకింత భారీ రేంజ్ లో ఉందని సమాచారం అందుతుండటం గమనార్హం.

సుజిత కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ఎక్కువ సంఖ్యలో ఆఫర్లను అందుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube