తిరుమల శ్రీవారిని సినీ నటుడు అల్లు శిరీష్ దర్శించుకున్నారు.ఈ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో అల్లు శిరీష్ స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన అల్లు శిరీష్ మీడియాతో మాట్లాడుతూ కరోనా కారణంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మూడు సంవత్సరాలుగా దర్శించుకోలేక పోయాయని, కరోనా తరువాత మొదటి సారి స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఊర్వశివో రాక్షశివో చిత్రం నవంబర్ నాల్గోవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా స్వామి వారి ఆశీస్సులు అందుకున్నట్లు అల్లు శిరీష్ అన్నారు.