మనదేశంలో చాలామంది ప్రజలు కర్పూరాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు.కర్పూరాన్ని ప్రతిరోజు ఉపయోగించడం వల్ల చాలా ఆరోగ్య సమస్యల నుంచి ఈ ఉపశమనం పొందవచ్చు.
కర్పూరం ఇంటికి సంతోషాన్ని, శ్రేయస్సును తెస్తుంది.మార్కెట్ లో చాలా తక్కువ ధరకే దొరికే కర్పూరం వల్ల ఎన్ని లాభాలున్నాయో ఇప్పుడు చూద్దాం.
కర్పూరం చాలా ప్రత్యేకమైన మొక్క నుంచి తయారు చేస్తారు.సాధారణంగా కర్పూరం మూడు రకాలు మొదటి జపనీస్, రెండవ భీమ్సేని, మూడవది పత్రి కపూర్.
కర్పూరాన్ని పూజకు, ఔషధానికి, సువాసనకు దీని రకాన్ని బట్టి ఏ పనికి ఉపయోగపడుతుందో ఆ పనికి ఉపయోగిస్తూ ఉంటారు.కర్పూరం ఇంట్లో నీ నెగెటివ్ ఎనర్జీని దూరం చేయడానికి కూడా పనిచేస్తుంది.
కర్పూరం సువాసన మనస్సును ఏకాగ్రత చేస్తుంది.కర్పూరం నూనె చర్మంలో రక్త ప్రసరణను సరిగ్గా జరిగేలా చేస్తుంది.
ఇది వాపు, మొటిమలు, జిడ్డుగల చర్మ సమస్యలను కూడా దూరం చేస్తుంది.ఆర్థరైటిస్ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి కర్పూరం కలిపిన లేపనాన్ని ఉపయోగిస్తారు.
కర్పూరంతో కూడిన బామ్‌ను మెడ నొప్పి కి కూడా ఉపయోగపడుతుంది.కర్పూరం నూనెను రుద్దడం వల్ల కఫం వల్ల వచ్చే ఛాతీ బిగుతు నుంచి ఉపశమనం కలుగుతుంది.
చర్మం పై ఇన్ఫెక్షన్ లో వల్ల వచ్చే దురద, మంట ను తగ్గించుకోవడానికి ఒక కప్పు కొబ్బరి నూనెలో ఒక టీ స్పూన్ కర్పూరాన్ని కలిపి రాసుకుంటే మంచిది.
వేడి నీళ్లలో కర్పూరం కలిపి ఆ నీటిలో కాళ్ల ను పది నిమిషాల పాటు ఉంచాలి.ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు ఇలా చేస్తే కాళ్ల పగుళ్ల సమస్య తగ్గుతాయి.జలుబు, దగ్గు విషయంలో వేడి నీటిలో కర్పూరం వేసి ఆవిరి తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు త్వరగా తగ్గే అవకాశం ఉంది.
ఎక్కువగా దగ్గు ఉన్నట్లయితే ఆవాలు లేదా నువ్వుల నూనెలో కర్పూరం కలిపి ఛాతీపై మసాజ్ చేయడం వల్ల వెంటనే ఉపశమనం కలుగుతుంది.