సూర్యకాంతమ్మ చనిపోయిన రోజు ప్రత్యక్ష సాక్షి చెప్పింది వింటే కన్నీళ్లు పెట్టకుండా ఉండలేరు

ఆమె సహజ నట కళా శిరోమణి, ఆమె హాస్య నట శిరోమణి, ఆమె బహుముఖ నటనా ప్రవీణ, రంగస్థల శిరోమణి.అవును ఇవన్నీ సూర్యకాంతం గురించే.

 Facts Behind Suryakantham Last Day Details, Actress Suryakantha, Legendary Actre-TeluguStop.com

నాలుగన్నర దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకుల అభిమాన గయ్యాళి అత్తగా ఒక వెలుగువెలిగిన మహానటి ఆమె.చేతి విసురతో మూతి విరుపుతో స్క్రీన్ పై సూర్యకాంతం నటన ఎన్ని తరాలైన మరచిపోలేవు.సూర్యకాంతం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ దగ్గరున్న వెంకట కృష్ణరాయపురం లో 1924 అక్టోబర్ 28న తన పొన్నాడ అనంతరామయ్య, రత్నమ్మ దంపతులకు 14వ సంతానంగా జన్మించింది.ఆరేళ్ళ చిన్న వయసులోనే పాడటం, నాట్యమాడటం నేర్చుకొంది.

పెరిగే వయసులో హిందీ సినిమా పోస్టర్లు ఆమెను బాగా ఆకర్షించాయి.

సినిమాల్లో నటించాలనే కోరిక ఆపుకోలేక … ఇంట్లో వారికి చెప్పకుండానే చెన్నై చేరుకుంది.

తరువాత సహాయ నటిగా “గృహప్రవేశం” సినిమాలో ఆమెకు అవకాశం వచ్చింది.ఇక 1952 లో వచ్చిన “పెళ్లి చేసి చూడు” చిత్రంతో ఆమెకి విజయా సంస్థ తో అనుభంధం ఏర్పడటం తో .సూర్యకాంతం కెరీర్ మరింత ఉపందుకుంది .అప్పట్లో అన్నపూర్ణ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వారి మొదటి సినిమా దొంగరాముడులోను సూర్యకాంతంకి మంచి పాత్ర లభించింది.ఇలా బ్యానర్ ఎవరిదైనా, అందులో హీరో హీరొయిన్ ఎవరైనా, సూర్యకాంతం తప్పకుండా ఆ చిత్రం లో ఉండవలిసిందే అనే విధంగా తెలుగు నాట ఆమె హవా కొనసాగింది.

Telugu Suryakantham-Movie

సూర్యకాంతం సినీ విజయాలు అన్నీ ఒక ఎత్తు అయితే 1962 లో ఆమె కోసమే ఆ పాత్ర పుట్టినట్లు, ఆ పాత్ర కోసమే .ఆ మహానుభావురాలు పుట్టినట్లు .ప్రేక్షకులను పలకరించిన గుండమ్మ పాత్ర ఒక ఎత్తు.మరి.ఇన్ని సాధించిన సూర్యకాంతం చివరి రోజున ఆమెని పరిశ్రమ పట్టించుకోలేదు అన్న వాస్తవం చాలా మందికి తెలియదు.సూర్యకాంతం 1996 డిశంబర్ 17వ తేదిన తిరిగిరాని లోకాలకి వెళ్లిపోయింది.అయితే.ఆ రాత్రి ఆమె బాడీని ఆంబులెన్స్ లో తీసుకుని వస్తే.ఒక్కరు కూడా ఆ బాడీ వెనుక రాలేదు.

దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలిన సూర్యకాంతం డెడ్ బాడీ దగ్గర నైట్ అంతా ఉండింది కేవలం ముగ్గురే ముగ్గురు.

Telugu Suryakantham-Movie

సూర్యకాంతం కజిన్, ఆమె దత్త పుత్రుడు, ఆమె కోడలు. ఈ ముగ్గురు మాత్రమే రాత్రంతా జాగారం చేశారు.ఇక పక్కరోజు ఈ వార్త మీడియాలో వచ్చినా హైదరాబాద్ నుండి ఏ ఒక్క ఆర్టిస్ట్ కూడా సూర్యకాంతంని చూడటానికి మద్రాస్ కి వచ్చింది లేదు.

ఇక ఎవ్వరు ఆఖరి చూపుకి రాకపోవడంతో మధ్యాహ్నం మూడు వరకు చూసి, సూర్యకాంతం కుటుంబ సభ్యులు ఆమె అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇదంతా ఈ రోజు మన కళ్ళ ముందుకు తీసుకచ్చింది ఆ నాటి ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్షి ప్రముఖులు తోట భావనారాయణ.

తరువాత కాలంలో సూర్యకాంతం అభిమానులు ఈ విషయాలన్నీ తెలిసి చాలా బాధపడ్డారు.మరి.చూశారు కదా? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube