పెళ్ళికి ముందే భర్తకు తన ఒంటి రంగు గురించి వార్నింగ్ ఇచ్చిన వాణిశ్రీ

కళాభినేత్రి వాణిశ్రీ 1962 లో ఎన్టీఆర్, అంజలి దేవి హీరో హీరోయిన్స్ గా నటించిన భీష్మ సినిమా ద్వారా తెలుగు సినిమా రంగ ప్రవేశం చేసింది.తెలుగులోనే ఎక్కువ సినిమాల్లో నటించిన వాణిశ్రీ తమిళ్ మరియు కన్నడ చిత్రాల్లో కూడా నటించింది.

 Facts Behind Actress Vanisri Karunakaran Marriage Details, Vani Sri,karunakaran,-TeluguStop.com

ఆమె దాదాపు 200 వరకు సినిమాల్లో నటించగా, అందులో 150 వరకు తెలుగు సినిమాలు ఉండగా, మిగతావి కన్నడ మరియు తమిళ సినిమాలు కావడం విశేషం.ఇక 1978 లో ఆమె ఫ్యామిలీ డాక్టర్ అయినా కరుణాకరన్ ని పెళ్లి చేసుకుంది.

అయితే ఆమె పెళ్ళికి ముందు అనేక విషయాలు ఆమెను ఒక కుదింపునకు గురి చేసాయి.వాస్తవానికి వాణిశ్రీ కి పెళ్లి చేయాలనీ ఆమె అక్క మరియు తల్లి భావించారు.

అందుకోసం సంబంధాలను కూడా చూడటం మొదలు పెట్టారు.

అయితే ఆమె ఇంటికి ఫామిలీ డాక్టర్ గా పని చేసిన కరుణాకరన్ ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించి పెళ్లి ప్రపోసల్ పెట్టారు.

అయితే అందుకు ముందు ఎప్పుడు మేకప్ లేకుండా వాణిశ్రీ ని చూడలేదు కరుణాకరన్.ఆమె చామన ఛాయా లో ఉంటుంది.అందుకే ఆమె ఎవరికి మేకప్ లేకుండా కనిపించదు.అయితే ఈ విషయం గురించి అన్ని అలోచించి నిర్ణయం తీసుకొమ్మని, పెళ్లయ్యాక అందాల సౌందర్య రాశి మీకు భార్య వస్తుంది అని పొరపడి చేసుకొనే ఆ తర్వాత ఇబ్బంది పడవద్దని వాణిశ్రీ ముందే ఆ డాక్టర్ ని హెచ్చరించింది.

అయినా కూడా అతడు ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.మొదట ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు.

అయితే కరుణాకరన్ అప్పటికి కేవలం ఎంబిబిఎస్ మాత్రమే చదివాడు.

Telugu Actress Vanisri, Karunakaran, Tollywood, Vanisri-Movie

ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లే అవకాశం రావడం తో వాణిశ్రీ అక్క పెళ్లి క్యాన్సిల్ చేసింది.నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఇప్పుడు ఫారెన్ వెళ్ళిపోతే ఆమె షూటింగ్స్ గట్రా ఎలా అంటూ గొడవకు దిగింది.అయితే వాణిశ్రీ జోక్యం తో అన్ని సర్దుమణిగాయి.

ఆమె కూడా కరుణాకరన్ ని చేసుకోవాలని డిసైడ్ అయ్యింది.దాంతో 1978 సినిమాల్లో అవకాశాలు నెమ్మదించగానే పెళ్లి చేసుకున్నారు.

ఆ తర్వాత భర్త ఫారెన్ కి వెళ్లిపోగా ఆమె ఇక్కడే ఉంటూ తన మిగతా సినిమాలు కూడా పూర్తి చేసింది ఆలా 1981 వరకు ఆమె నటించింది.ఆ తర్వాత కరుణాకరన్ ఇండియా కి రాగానే ఆమె నటన కు స్వస్తి పలికి ఇద్దరు పిల్లలకు అమ్మ అయ్యింది.

ఆ తర్వాత ఆమె పిలల్లు కూడా ఇద్దరు డాక్టర్స్ కావడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube