తెలుగు ప్రేక్షకులకు నటి దివ్య భారతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బ్యాచిలర్ అనే తమిళ డబ్బింగ్ సినిమాతో తెలుగు వారికి దగ్గరయింది దివ్యభారతి.
ఆ సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది.ఇకపోతే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తమిళ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.
సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.అలాగే తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది.
ఆ పోస్టులో తన శరీర నిర్మాణం కారణంగా ఆమె ఎదుర్కొన్న ట్రోలింగ్స్ ని చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది.
ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్టును కూడా చేసింది.ఆ పోస్టులో ఆమె ఈ విధంగా రాసుకొచ్చింది.ఏదో నిరూపించాలని, ఏదో వివరించాలని నేను ఈ పోస్టు పెట్టడం లేదు.మీ శరీరాన్ని మీరు ప్రేమించండి.
గత కొన్ని రోజుల నుంచి నా శరీరంపై కొన్ని కామెంట్లు వస్తున్నాయి.నేను హిప్ ప్యాడ్లు పెట్టుకున్నానని, హిప్ సర్జరీ చేయించుకున్నానని అంటున్నారు.
నేను కాలేజ్‌లో చదివే రోజుల్లో.నా హిప్ కారణంగా భయంకరమైన కామెంట్లు ఎదుర్కొన్నా.
నన్ను ఫ్యాంటా బాటిల్ శరీరం, అస్థిపంజరం, బిగ్ బట్ గల్ అని ఒక్కొక్కరు ఒక్కొక్క కామెంట్స్ చేసేవారు.
నా కాలేజ్ టైంలోని ఓ స్లామ్ బుక్ పేజీని ఇక్కడ ఉంచాను.నా క్లాస్‌మేట్ ఒకరు నా శరీరం గురించి ఓ బొమ్మకూడా గీశాడు.అప్పట్లో నేను నా శరీర నిర్మాణం కారణంగా చాలా ఇబ్బందులు పడ్డాను.నలుగురిలో నడవటానికి కూడా భయపడేదాన్ని.2015లో ఇన్‌స్టా ఓపెన్ చేశాను.మోడలింగ్ ఫొటోలు అందులో ఉంచేదాన్ని.చాలా మంది నా షేపును చూసి మెచ్చుకోవటం మొదలుపెట్టారు.ఇక అప్పటినుంచి నా శరీరంపై నాకు ప్రేమ మొదలైంది.నేను నా తోటి మహిళలకు ఒకటే చెబుతాను.
విమర్శలను మనసుకు తీసుకోనంత వరకు.పొగడ్తలను బుర్రకు ఎక్కించుకోనంత వరకు మనం దృఢంగా ఉంటాం.
నేను దీన్ని కచ్చితంగా చెప్పగలను రాసుకొచ్చింది దివ్య భారతి.చాలామంది అభిమానులు ఆ పోస్ట్ పై స్పందిస్తూ దివ్యభారతికి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.