ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా ఇంద్ర.ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.ఇందులో చిరంజీవి చిన్నప్పటి క్యారెక్టర్ చేశాడు తేజ సజ్జా. చైల్డ్ ఆర్టిస్టుగా తొడకొట్టి కుర్చీలో కూర్చునే సీన్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంది.తేజకు రెండున్నర సంవత్సరాల వయసున్నప్పుడు.తన కజిన్ తో కలిసి రెస్టారెంట్ కు వెళ్లాడట.
అప్పుడు చూడాలని ఉంది సినిమా కోసం ఓ అబ్బాయి కోసం డైరెక్టర్ గుణశేఖర్ వెతుకుతున్నాడట.సరిగ్గా అదే సమయంలో హోటల్ లో ఈ అబ్బాయిని చూశాడట.
అక్కడే తనను ఫిక్స్ చేసుకున్నాడట.
గుణశేఖర్ సినిమాతో చైల్ట్ ఆర్టిస్టుగా పరిచయం అయిన తేజ.
ఆ తర్వాత బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇంద్ర సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు.బాల నటుడిగా సుమారు 50 చిత్రాల్లో నటించాడు.
ఓ బేబీ సినిమాలో చక్కటి నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.పలు సినిమాలో మంచి నటన కనబర్చి వారెవ్వా అనిపించాడు.
తేజ పెద్దయ్యాక హీరో అవకాశాల కోసం చాలా కష్టపడ్డాడు.చివరకు జాంబిరెడ్డి సినిమాతో హీరోగా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యాడు.
ఈ సినిమాలో హీరో ఛాన్స్ కోసం తేజ ఐదేండ్లు వేచి చూశాడట.

అటు మరికొన్ని సినిమాల్లోనూ తేజకు అవకాశం వచ్చింది.అంతా ఓకే సినిమా షూటింగ్ మొదలువుతుంది అనుకున్న సమయంలో పలు కారణాలతో కొన్ని ప్రాజెక్టులు ఆగిపోయాయట.మరికొందరు తనకు హీరోగా అవకాశం ఇవ్వాలని కోరితే సున్నితంగా తిరస్కరించారట.
అటు చాలా అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారి పోయాయట.అయినా పట్టువిడవకుండా ప్రయత్నించాడు తేజ.

సుమారు 5 సంవత్సరాల పాటు ఇబ్బందులు పడి చివరకు అనుకున్నది సాధించాడు.జాంబిరెడ్డి సినిమాలో హీరోగా అవకాశం దక్కించుకున్నాడు.ప్రస్తుతం తన తదుపరి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకోవాలి అనుకుంటున్నాడు.ప్రస్తుతం కొన్న సినిమాలకు సంబంధించి కథలు వింటున్నాడట తేజ.భవిష్యత్ లో మంచి మూవీస్ చేసి సక్సెస్ ఫుల్ గా సినిమా కెరీర్ కొనసాగించాలని మనమూ కోరుకుందాం.