తరుణ్, రోజా రమణి గురించి కళ్ళు బైర్లు కమ్మే నిజాలు

కొన్ని జీవితంలో జరిగే సంఘటనలు ఎలా ఉంటాయి అంటే అవి మళ్లీ మళ్లీ జరగవు అన్న విధంగా ఉంటాయి.అవి అద్భుతాలు గానే మిగిలిపోతుంటాయి.

 Facts About Tarun And Roja Ramani Details, Roja Ramani About Tarun,roja Ramani,t-TeluguStop.com

సరిగ్గా తరుణ్( Tarun ) జీవితంలో అలాంటి కొన్ని అద్భుతాలు ఉన్నాయి.తరుణ్ తల్లి నటి రోజా రమణి( Roja ranami ) గురించి మనందరికీ తెలిసిందే.

ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా తన ప్రయాణం మొదలుపెట్టి హీరోయిన్ గా వందల సినిమాల్లో నటించి ఎంతో గొప్ప స్థాయిలో విజయాలను అందుకున్నారు.అయితే తన కొడుకు జీవితంలో అలాగే రోజా రమణి జీవితంలో ఎన్నో రకాలైన సంఘటనలు ఒకే విధంగా జరిగాయి.

అవి వినడానికి ఎంతో ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి.ఆ ఆశ్చర్యకరమైన సంఘటనలు ఏంటి వారి జీవితంలో ఏం జరిగాయి అనే విషయాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

Telugu Roja Ramani, Rojaramani, Tarun, Tarun Ups-Movie

రోజా రమణి భక్త ప్రహ్లాద( Baktha prahladha ) పాత్రలో మొట్టమొదటిసారి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.ఆ సినిమా ఘనవిజయం సాధించడంతో నేషనల్ లెవెల్ లో ఎన్నో అవార్డ్స్ రాగా రోజా రమణి సైతం ప్రెసిడెంట్ మెడల్ అందుకున్నారు అదే విధంగా తన కొడుకు తరుణ్ విషయంలో కూడా అంజలి( Anjali movie ) సినిమాలో మొట్టమొదటిసారిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమయ్యాడు అలాగే ఆ సినిమాకు గాను నేషనల్ అవార్డు దక్కడంతో ప్రెసిడెంట్ చేతుల మీదుగా ఆ అవార్డు అందుకున్నాడు.భక్త ప్రహ్లాద చిత్రానికి గాను రోజారమణి స్టేట్ అవార్డు అందుకోగా తరుణ్ సైతం మనసు మమత కోసం స్టేట్ అవార్డు అందుకున్నాడు.ఇక రోజా రమణి తన 13వ ఏట హీరోయిన్ గా నటించడం మొదలుపెట్టింది అలాగే తరుణ్ తన 14వ ఏట నువ్వే కావాలి సినిమా ద్వారా హీరోగా అడుగు పెట్టాడు.

Telugu Roja Ramani, Rojaramani, Tarun, Tarun Ups-Movie

13 ఏళ్ల వయసులో మలయాళ సినిమా ద్వారా రోజా రమణి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే మలయాళ చిత్రం రీమేక్ నువ్వే కావాలి( Nuvve kavali ) సినిమాతో తరుణ్ వచ్చాడు.రోజా రమణి చాలా గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్ అనే విషయం మనందరికీ తెలిసిందే ప్రస్తుతం తరుణ్ కూడా కొన్ని డబ్బింగ్ వర్క్స్ చేస్తున్నాడు ఇలా ఇన్ని విషయాల్లో తన తల్లితో పోలికలను కలిగి ఉండడం తరుణ్ చేసుకున్న అదృష్టం అనే చెప్పవచ్చు.ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ ఇంటీరియర్ డిజైనర్ గా బిజీగానే ఉన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube