తెలంగాణలో ఏర్పాటు కానున్న కొత్త ప్రభుత్వంలో మంత్రివర్గంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.ఎవరెవరికీ పదవులు లభిస్తాయనే దానిపై ఆసక్తి కొనసాగుతోంది.
మంత్రివర్గ కూర్పుపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది.ఉమ్మడి జిల్లాల నుంచి విజయం సాధించిన పలువురు కీలక నేతలకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.
వీరిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉండగా.నల్గొండ జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేదా ఆయన సతీమణికి మంత్రి పదవి వచ్చే ఛాన్స్ ఉంది.
ఆదిలాబాద్ నుంచి వివేక్ వెంకటస్వామి, ప్రేమ్ సాగర్ రావు, వెడ్మ బొజ్జు.వరంగల్ నుంచి సీతక్క, కొండా సురేఖ,.
ఖమ్మం నుంచి భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి పదవి రేసులో ఉన్నారని సమాచారం.ఈ క్రమంలో ఎవరిని మంత్రి పదవి వరిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.