వైరల్: పసిబిడ్డను ఓదారుస్తున్న ఆవుని చూడండి.. రెండు కళ్ళు చాలవంటే నమ్మండి!

ఈమధ్య కాలంలో చూసుకుంటే సోషల్ మీడియాలో( Social Media ) ఎక్కువగా జంతువులకు చెందిన వీడియోలు ఎక్కువగా వైరల్ కావడం మనం చూస్తూ వున్నాం.అందులో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యంగా, ఇంకొన్ని భయానకంగా ఉంటాయి.

 Emotional Bonding Between Cow And A Baby Video Viral Details, Viral Video, Viral-TeluguStop.com

ఐతే తాజాగా ఇక్కడ వైరల్ అవుతున్న వీడియో మాత్రం చాలా ఎమోషనల్ గా అనిపిస్తోంది.ముఖ్యంగా కొన్ని జంతువులు చిన్న పిల్లలతో( Children ) అనుబంధాన్ని పెనవేసుకుంటాయి.

వారికి ఇవి ఎటువంటి హాని కలిగించవు.

ఈ క్రమంలోనే, ఓ పసిబిడ్డను ఆవు ( Cow ) ఓదారుస్తున్న వీడియో ఇపుడు అందరి మనసులను హత్తుకుంది.చిన్న పాప, ఆవు మధ్య అనుబంధాన్ని పెనవేసుకొనే అందమైన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోందని చెప్పుకోవచ్చు.ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ రీల్స్ జీబీ అనే యూజర్ ద్వారా షేర్ చేయబడిన ఈ వీడియో ముచ్చట కలిగిస్తోంది.

మంచంపైన కూర్చున్న చిన్నారిని నిమురుతూ ఓదారుస్తున్న ఆవుని ఇక్కడ వీడియోలో గమనించవచ్చు.

ఈ తరుణంలో ఆ నెలల వయస్సుగల పాప ఆవుకు అస్సలు భయపడకుండా ఉండడం చూడవచ్చు.అంతేకాకుండా ఆ చిన్నారి ఆ ఆవుని హత్తుకోవడం గమనార్హం.కాగా ఈ క్యూట్ వీడియో అందరి మనసులు కొల్లగొట్టింది.

నిజానికి పసిపాపని ఆవుకి అంత దగ్గరలో ఉంచడానికి ఫ్యామిలీ మెంబర్స్ భయపడతారు.అయితే వీరికి ఆ ఆవు బాగా అలవాటుపడినదిగా అర్ధం అవుతోంది.

అయితే నెటిజన్లు మాత్రం ఆవులు సాధు జంతువులే అయినప్పటికీ అవి జంతువులేకదా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం అని కామెంట్స్ చేస్తున్నారు.కొంతమంది నెటిజన్లు ‘క్యూట్ నెస్ ఓవర్ లోడ్’ అని, మరికొంతమంది ‘ఓ మై హార్ట్.’ అని కామెంట్స్ చేయడం ఇక్కడ చూడవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube