ప్రజలకు ఉచితంగా ఇవ్వవలసిన రేషన్ దుకాణాల్లో లెక్కలేనంత అవినీతి జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.సమయానికి రేషన్ సరుకులు అందించక.
ఇవ్వవలసిన సరకుల విషయంలో కోతలు పెడుతూ, తక్కువ కొలతలో రేషన్ సరకులు ఇస్తూ మొత్తానికి జనాన్ని మోసగించే రేషన్ దుకాణ దారులు ఎక్కువైయ్యారు.
ఇలాగే ఒక వ్యాపారి మోసం చేయడానికి ప్రయత్నించి అడ్దంగా బుక్ అయిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో చోటు చేసుకుంది.
ఆ వివరాలు చూస్తే.స్దానికంగా ఉన్న శ్రీ సాయికృష్ణ రైస్ ఇండస్ట్రీ భాగస్వామి నరసింహారావు పై బియ్యాన్ని దారి మళ్లించి రూ.1.95 కోట్ల మేర మోసగించినట్టు అభియోగాలు నమోదయ్యాయి.దీంతో రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, నరసింహారావుకు చెందిన రూ.1.67 కోట్ల ఆస్తులను జప్తు చేసింది.చూశారా మనుషుల కక్కూర్తి.
వచ్చిన దానితో తృప్తి పడకుంటే చివరికి చిప్పకూడే గతి అవుతుంది.