తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దాదాపుగా 100కి పైగా చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించి బాగానే గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ “అభిషేక్ నామా” గురించి చలన చిత్ర పరిశ్రమలో తెలియనివారుండరు.అయితే తాజాగా అభిషేక్ నామా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని సినిమాల డిస్ట్రిబ్యూట్ సమయంలో ఎదురయ్యే అవంతరాలు మరియు లాభ నష్టాల గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.
అయితే ఇందులో భాగంగా తాను ఇప్పటి వరకు తెలుగు, హాలీవుడ్, బాలీవుడ్, తదితర చిత్రాలను కలిపి దాదాపుగా 100కి పైగా చిత్రాలకి డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించినట్లు తెలిపాడు.ఇందులో ముఖ్యంగా తాను అప్పట్లో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం వహించిన “వరుడు” చిత్రానికి డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించానని దీంతో దాదాపుగా 100% డబ్బుని నష్ట పోయానని చెప్పుకొచ్చాడు.
దాంతో దర్శకుడు గుణ శేఖర్ మళ్లీ రుద్రమ దేవి చిత్రానికి డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించే అవకాశాన్ని ఇచ్చాడని తెలిపాడు.ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన మరో చిత్రానికి కూడా తాను డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించి బాగా నష్టపోయానని దాంతో మహేష్ బాబు పిలిచి మరీ కొంత డబ్బుని తిరిగి ఇచ్చేశాడని తెలిపాడు.
ఇక ప్రస్తుతం ఓటిటి యాప్స్ ఆడియన్స్ కి అందుబాటులోకి రావడం మంచి విషయమే అయినప్పటికీ దానివల్ల ప్రేక్షకులు సినిమా థియేటర్లో సినిమాలు చూసేందుకు పెద్దగా రావడం లేదని దాంతో కొంతమేర డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతున్నారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.దీనికితోడు ఓటిటి ధరలు కూడా 400 నుంచి 500 రూపాయలు ఉండటంతో ప్రజలు ఎక్కువగా సినిమాలను ఓటిటి యాప్ లో చూసేందుకు మొగ్గు చూపుతున్నారని దాంతో చిత్రం థియేటర్స్ లో విడుదలయిన ఆరు నెలల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలనే నిబంధన కోసమై తాము మూవీ కౌన్సిల్ లో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపాడు.