మీ పిల్లలకు ఈ ఆహారాన్ని అందించండి... పోషకాహారలోపమే ఉండదు!

మనలో చాలామందికి చిన్నపిల్లలకు( Children ) ఎలాంటి ఆహారం ఇవ్వాలనే సందేహం ఉంటుంది.ఎందుకంటే చిన్న వయస్సులోనే తగు జాగ్రత్తలు తీసుకోకుంటే వారు పెద్దయిన తరువాత అనేక అనారోగ్య సమస్యలకు గురవుతారు.

 These Are The Best Food Combinations To Fight Against Malnutrition In Children D-TeluguStop.com

కాబట్టి వారి శరీరం పోషకాహార లోపం( Malnutrition ) బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే… కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను పెట్టాలని చెబుతున్నారు నిపుణులు.ఆ ఆహారం ద్వారా శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలు, ఖనిజాలను అందుతాయి.

కొన్ని రకాల ఫుడ్ కాంబినేషన్లను పిల్లలు మాత్రమే కాకుండా పెద్దలు కూడా తినాల్సిన అవసరం ఉంది.అలాంటి ఆహారం తీసుకోవడం వలన శరీరం విటమిన్లను, ఖనిజాలను, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలను పుష్కలంగా శోషించుకుంటుంది.

తద్వారా పోషకాహార లోపం ఉండదు.

Telugu Badam, Banana, Curd, Care, Tips, Healthy, Latest, Mushrooms, Olive Oil, O

అలాంటి ఆహారంలో మొదటిది “అరటిపండు – పెరుగు కాంబినేషన్.”( Banana – Curd ) ఓ కప్పు పెరుగులో అరటిపండు ముక్కలను వేసుకొని పిల్లలకు తినిపించడం చేయాలి.ఎందుకంటే అరటిపండులో పొటాషియం, పెరుగు వంటి అధిక ప్రోటీన్ కలవడం వల్ల శరీరంలోని కండరాలకు మంచి జరుగుతుంది.

పెరుగులో ఉండే కాల్షియం ఎముకలకు మంచి చేస్తుంది.ఆ తరువాత “పుట్టగొడుగులు – నువ్వుల గింజలు” సూపర్ కాంబినేషన్.

ఇది విటమిన్, మినరల్ కాంబో అని చెప్పుకోవచ్చు.అదేవిధంగా “నిమ్మకాయ – ఆకుకూరలు” అనేవి కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

నిమ్మకాయలో విటమిన్ సి, ఆకుపచ్చని కూరగాయల్లో ఐరన్ మనకి మంచి చేస్తుంది.

Telugu Badam, Banana, Curd, Care, Tips, Healthy, Latest, Mushrooms, Olive Oil, O

అదేవిధంగా “ఆలివ్ నూనె – పాలకూర” కాంబినేషన్ కూడా చాలా మంచిది.రోజుకో స్పూన్ ఆలివ్ నూనె తీసుకోవడం పిల్లలకు అలవాటు చేయాలి.పాలకూర వండినప్పుడు నూనెతో వండితే మంచిది.

రెండింట్లోనూ పోషకాలు శరీరానికి పుష్కలంగా అందుతాయి.ఇక “బాదంపప్పు – నారింజ పండ్లు” అనేవి రోగ నిరోధక శక్తిని పెంచడానికి చాలా అవసరం.

ఈ రెండింటిలో విటమిన్ సి, విటమిన్ Eలు అధికంగా ఉంటాయి.ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని కాపాడేందుకు కృషి చేస్తాయి.

చర్మానికి రెట్టింపు అందాన్ని ఇస్తాయి.కాబట్టి ఈ కాంబినేషన్ పిల్లలకు తరచూ పెట్టడం వలన భవిష్యత్తులో చాలా ఆరోగ్యంగాను, ధృఢంగానూ వుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube