అమ్మ బాబోయ్ : పెళ్లి చేసుకుంటావా అని శ్రీముఖి ని అడిగిన నెటిజన్... దాంతో..

తెలుగు బుల్లితెరలో తన గలగల మాటలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టాలీవుడ్ బ్యూటిఫుల్ యాంకర్ “శ్రీముఖి” గురించి కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే శ్రీముఖి సినిమా పరిశ్రమకి వచ్చిన మొదట్లో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన “జులాయి” అనే చిత్రం ద్వారా నటిగా పరిచయమైంది.

 Telugu Anchor Sreemukhi Got Marriage Proposal Instagram, Telugu Anchor, Sreemukh-TeluguStop.com

ఆ తరువాత ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా నటించిన “నేను శైలజా” చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించినప్పటికీ హీరోయిన్ గా అవకాశాలు మాత్రం దక్కించుకోలేకపోయింది.దీంతో యాంకరింగ్ రంగంలో అవకాశం రావడంతో ప్రస్తుతం బాగానే రాణిస్తోంది.

ప్రస్తుతం కకరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో కొంతకాలం పాటూ సినిమా షూటింగులకి బ్రేక్ వచ్చింది .దీంతో శ్రీముఖి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.కాగా తాజాగా కొందరు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చింది.ఈ క్రమంలో ఓ నెటిజన్ “నన్ను పెళ్లి చేసుకుంటావా.?” అని అడిగాడు.దీంతో శ్రీముఖి తనదైన శైలిలో స్పందిస్తూ మన్మధుడు చిత్రంలోని “సోదరా వద్దురా… పెళ్లంటే నూరేళ్ల మంటారా” అనే పాటతో రిప్లై ఇచ్చింది.

దీంతో ఒక్కసారిగా ఆ నెటిజన్ అవాక్కయ్యాడు.

ఇక మరో నెటిజన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ వంటివి తొందర్లోనే బ్యాన్ కాబోతున్నాయని కాబట్టి ఫోన్ నెంబర్ ఇవ్వాలని కోరాడు.

దీంతో శ్రీముఖి ఒక్కడు సినిమాలో ధర్మవరం సుబ్రహ్మణ్యం చెప్పినటువంటి ఫోన్ నెంబర్ వీడియోతో రిప్లై ఇచ్చింది.దీంతో శ్రీముఖి తో చాలా జాగ్రత్తగా ఉండాలని అంటూ కొందరు సరదాగా కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube