భారీ వర్షాలు కారణంగా గర్భిణీల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం...!!

తెలంగాణ రాష్ట్రం( Telangana State )లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో వరదలు సంభవించి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 Due To Heavy Rains, Telangana Government Has Taken Precautionary Pregnant Women,-TeluguStop.com

ఇదే సమయంలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు( Heavy Rains ) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.బంగాళాఖాతంలో బుధవారం ఏర్పడిన తీవ్ర అల్పపీడనం గురువారం నాటికి బలహీన పడిందని ప్రస్తుతం దక్షిణ ఒడిశా పరిసర లో ఉత్తర ఏపీ పరిసరాలలో.

ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.దీంతో తెలంగాణలో అనేక ప్రాంతాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలకు శుక్రవారం సెలవు దినం ప్రకటించడం తెలిసిందే.పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గర్భిణీల విషయం( Pregnant Women )లో వైద్య శాఖ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

విషయంలోకి వెళ్తే ముందు జాగ్రత్తగా నెలలో నిండిన 503 మంది గర్భిణీలను.ఆసుపత్రులకు తరలించారు.వారికి వైద్య సాయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది.ఇంకా ఇదే సమయంలో లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

చాలా చోట్ల వరద నీళ్లు గ్రామాల్లోకి వస్తూ ఉండటంతో ప్రభుత్వ అధికారులు గ్రామాలను కూడా ఖాళీ చేసే పరిస్థితి నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube