పొలాలలో అధిక దిగుబడి కోసం నీటిపారుదల పద్ధతులు..!

వ్యవసాయం( Agriculture ) చేసే రైతులు కొన్ని మెలకువలు పాటిస్తే తక్కువ శ్రమతో అధిక దిగుబడి పొందవచ్చు.అయితే వ్యవసాయనికి నీటి తడులు ఎంత ప్రధానమైనవో రైతులకు బాగా తెలుసు.

 Best Modern Methods Of Irrigation,irrigation,irrigation Methods,agriculture,furr-TeluguStop.com

నీటిని పొలం అంతా పారిస్తే ఎక్కువ మొత్తంలో నీరు వృధా అవ్వడంతో పాటు అనవసర కలుపు మొక్కలు పొలం అంతా మొలకెత్తుతాయి.అయితే పొలానికి నీటిని అందివ్వడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి.ఆ పద్ధతులను పాటిస్తే నీరు చాలా వరకు ఆదా అవుతుంది.

స్ప్రింక్లర్ ఇరిగేషన్( Irrigation sprinkler ):

Telugu Agriculture, Basin, Modern Methods, Furrow, Methods, Latest Telugu-Latest

ఒక నీటి ట్యాంకులు ఎత్తైన ప్రదేశంలో ఏర్పాటు చేసి, ఒక సన్నని ప్లాస్టిక్ పైప్ లో నీటి ఒత్తిడిని పెంచి వర్షపు జల్లులుగా నీరు మొక్కలపై పడేలా స్ప్లింకర్ ద్వారా నీటిని విడుదల చేయాలి.

బిందు నీటి సేద్యం( Drip Irrigation ):

Telugu Agriculture, Basin, Modern Methods, Furrow, Methods, Latest Telugu-Latest

ఒక ఎత్తైన ప్రదేశంలో నీటి ట్యాంక్ ఏర్పాటు చేసి, రంద్రాలు ఉన్న పైపులు నేలపై అమర్చి ఆ పైప్ ద్వారా నీటిని పారించాలి.అవసరం అయినంత మేరకు మాత్రమే నీటిని పారిస్తే కలుపు సమస్య తక్కువగా ఉంటుంది.ఈ పద్ధతిలో నీటి ద్వారా మొక్కకు కావలసిన పోషకాలను కూడా అందించవచ్చు.

మడి పద్ధతి:

తోటను చిన్నచిన్న మడులుగా ఏర్పాటు చేసుకోవాలి.ఒక మడుగులో ఆరు చెట్లు వరకు ఉండేటట్లు చూసుకొని నీటిని అందిస్తే నీరు వృధా అవదు.

ఫర్రో పద్ధతి( Furrow Irrigation ):

Telugu Agriculture, Basin, Modern Methods, Furrow, Methods, Latest Telugu-Latest

చెట్ల వరుసల మధ్య నాగలితో 15-20 సెంటీమీటర్ల లోతులో చాళ్ళు ఏర్పాటు చేసి నీటిని పారించాలి.చిన్న మొక్కలకు ఒక చళ్ళు ఉంటే సరిపోతుంది.ఈ చాళ్లలో నీరు కొన్ని గంటల వరకు నిలిచేలా నీటిని అందించాలి.ఇలా చేస్తే కలుపు సమస్య ఉండదు.

బెసిన్ పద్ధతి( Basin Irrigation ):

Telugu Agriculture, Basin, Modern Methods, Furrow, Methods, Latest Telugu-Latest

ఈ పద్ధతిలో ప్రతి చెట్టు వద్ద గుండ్రంగా లేదా చదరంగా గట్టు వేసి లోపలి భాగాన్ని చదును చేయాలి.ఈ పద్ధతిలో నీటి కాలువలు చెట్ల వరుసల మధ్య చేసి, కాలువ ద్వారా చెట్టుకు నీరు పారించాలి.ఇలా చేస్తే చాలా నీరు ఆదా అవుతుంది.

చాలావరకు కలుపు సమస్య ఉండదు.

అంటే పొలానికి నేరుగా నీటిని వదలకుండా పైపుల ద్వారా, పైన చెప్పిన పద్ధతుల ద్వారా నీటిని అందిస్తే శ్రమతో పాటు కలుపు సమస్యలు దాదాపుగా తగ్గుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube