గొంతులో క‌ఫానికి చెక్ పెట్టే ఎఫెక్టివ్ టిప్స్ మీకోసం!

అప్పుడ‌ప్పుడు గొంతులో క‌ఫం చేరుతూ ఉంటుంది.ఈ క‌ఫం వ‌ల్ల గొంతు గ‌ర గ‌ర మ‌న‌డం, తీవ్ర అసౌక‌ర్యం, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది వంటి స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయి.

 Home Remedies To Remove Mucus From Throat! Home Remedies, Remove Mucus, Throat,-TeluguStop.com

ఈ క‌ఫం విష‌యంలో నిర్ల‌క్ష్యంగా ఉంటే ద‌గ్గుకు కూడా దారితీస్తుంది.అందుకే వీలైనంత త్వ‌ర‌గా క‌ఫాన్ని నివారించుకోవాలి.

మరి క‌ఫాన్ని ఎలా త‌గ్గించుకోవాలి.అందు కోసం ఏం ఏం చేయాలి.

అన్న విష‌యాలు లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

గొంతులో క‌ఫానికి చెక్ పెట్ట‌డంలో ఉల్లిపాయ అద్భుతంగా స‌మాయ‌ప‌డుతుంది.

ఒక ఉల్లిపాయను తీసుకుని మెత్త‌గా గ్రౌండ్ చేసి ర‌సం తీసుకోవాలి.ఆ ర‌సంలో కొద్దిగా స్వ‌చ్ఛ‌మైన తేనె మిక్స్ చేసి సేవించాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల ఉల్లిలో ఉండే సల్ఫర్ ఇట్టే క‌ఫాన్ని నివారిస్తుంది.

అలాగే పుదీనాతో కూడా గొంతులో ఏర్ప‌డిన క‌ఫాన్ని త‌గ్గించుకోవ‌చ్చు.

ఒక గ్లాస్ వాట‌ర్‌లో కొన్ని పుదీనా ఆకులు వేసి బాగా మ‌రిగించి.వ‌డ‌బోసుకోవాలి.ఇప్పుడు ఈ నీటిలో కొద్దిగా నిమ్మ ర‌సం క‌లిపి సేవిస్తే క‌ఫం క్ర‌మంగా త‌గ్గిపోతుంది.

అలాగే ఒక గిన్నెలో కొన్ని మెంతులు, నాలుగైదు ల‌వంగాలు వేసి లైట్‌గా వేయించాలి.

ఇప్పుడు కాట‌న్ క్లాత్‌లో వీటిని చుట్టి.గొంతు మ‌రియు మెడ‌పై మెల్ల మెల్ల‌గా అద్దుకోవాలి.

ఇలా చేసినా క‌ఫం క‌రిగిపోతుంది.

ఇక వీటితో పాటు త‌ర‌చూ ఆవిరి ప‌డుతూ ఉండాలి.

ఆవిరి ప‌ట్ట‌డం ద్వారా క‌ఫం త‌గ్గి.గొంతు క్లీన్ అవుతుంది.

అలాగే క‌ఫం ఏర్ప‌డిన‌ప్పుడు పాలు, ఇత‌ర పాల ఉత్ప‌త్తులు, ఆయిల్ ఫుడ్స్‌, బాగా ఫ్రై చేసిన ఆహారాలు, కూల్ డ్రింక్స్‌, ఐస్ క్రీములు వంటి వాటికి దూరంగా ఉండాలి.లేదంటే క‌ఫం మ‌రింత ఎక్కువ అవుతుంది.

వాట‌ర్ ఎక్కువ‌గా తీసుకోవాలి.మ‌ద్యం సేవించ‌డం, స్మోకింగ్‌కు దూరంగా ఉండాలి.

Home Remedies To Remove Mucus From Throat! Home Remedies, Remove Mucus, Throat, Throat Mucus, Latest News, Mucus, Health Tips, Good Health, Health, Onion Water, Pure Honey, Sulfur, Mint Leaves, Lemon, Solve Mucus Problem - Telugu Tips, Latest, Lemon, Mint, Mucus, Pure Honey, Remove Mucus, Solvemucus, Sulfur, Throat, Throat Mucus #Shorts

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube