మహమ్మారి కరోనా వైరస్ ( Corona virus )కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.కొత్త కొత్త వేరియంట్లు ప్రభుత్వాలను వణుకు పుట్టిస్తున్నాయి.
ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పలు మార్గదర్శకాలు చేస్తూ ఉన్నాయి.ఈ క్రమంలో కేసులు పెరుగుతున్న తరుణంలో కరోనా చికిత్స విషయంలో ఉపయోగించే మెడిసిన్ లపై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
కరోనా చికిత్సలో యాంటీబయోటిక్ మెడిసిన్ వాడకూడదని తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది.ప్లాజ్మా థెరపీ చేయొద్దని సూచించింది.
ఇదే సమయంలో లూపినవిర్, రిటోనవిర్, హైడ్రాక్సిక్లోరోక్వీన్, ఐవర్ మెక్టిన్, మెల్నుపిరివర్, ఫావిపిరివర్, అజిత్రోమైసిన్, డాక్సీ సైక్లీన్… ఔషధాలను కరోనా రోగులకు ఇవ్వొద్దని కేంద్రం సూచించింది.H3N2 అనే కొత్త వేరియంట్ ద్వారా దేశంలో విస్తారంగా కేసులు నమోదు అవుతున్నాయి.ఈరోజు ఒక్కరోజే 44 వేలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తే 900 కు పైగా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కేరళ, మహారాష్ట్ర, గుజరాత్… రాష్ట్రాలతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేసింది.