అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై ఆ దేశ ప్రజానీకం ఫైర్ అవుతున్నారు.అసలు నువ్వు దేశాధ్యక్షుడు అనుకున్నావా ఆటగాడు అనుకున్నావా అంటూ కొందరు కామెంట్ చేస్తుంటే మరికొందరు మాత్రం ఒబామా కి బుద్ది చెప్పి నువ్వు చేస్తోంది ఏమిటి అంటూ తెగ ఫైర్ అవుతున్నారు.
ఇంతకీ అమెరికా పౌరులకి ట్రంప్ పై అంతగా కోపం రావడానికి గల కారణం ఏమిటి అనే వివరాలలోకి వెళ్తే.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక రోజు గోల్ఫ్ ఆడటమే అమెరికా ప్రజల ఆగ్రహానికి బలైన పోవడానికి కారణం.
వారంలో ఐదు రోజులు పనిదినాలు ఉండగా వాటిలో ఒక రోజుని గోల్ఫ్ ఆడానికి వినియోగించడాన్ని తప్పు బట్టారు.ఏడాది లో అనేక రోజులు ఇలానే వృధా చేశారంటూ అమెరికా మీడియా మొత్తం కోడై కూస్తోంది.
అంతేకాదు ఒమాబా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో గోల్ఫ్ ఆడటం పెద్ద తప్పని అధ్యక్షుడు సమయాన్ని వృధా చేస్తున్నారంటూ ట్రంప్ అన్న మాటలని గుర్తు చేస్తున్నారు.
అప్పట్లో ఒబామా పై చేసిన వ్యాఖ్యలు ట్రంప్ మర్చిపోయారంటూ నెటిజన్లు సైతం ఫైర్ అవుతున్నారు.
అధ్యక్షుడిగా ఎన్నికైతే నిరంతరం ప్రజల్లోనే ఉంటాను ఓబమాలా గోల్ఫ్ ఆడను అంటూ ప్రచారం చేసుకున్న ట్రంప్ ఇప్పుడు గోల్ఫ్ ఎలా ఆడుతున్నారంటూ మండిపడుతున్నారు.