భారత సంతతి యువకుడు అమెరికాలో పర్వతాలపై ఎక్కడానికి వెళ్లి అక్కడ తీవ్ర గాయాలపాలయ్యాడు.ఈ సంఘటన అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ఈ రాష్ట్రంలో అతిపెద్దదైన ది పీర్లె గేట్స్ కొండపైకి ఎక్కుతున్న క్రమంలోనే ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది.వివరాలోకి వెళ్తే.
తన స్నేహితులతో కలిసి పీర్లె గేట్స్ కొండని ఎక్కాలని అనుకున్న భారత సంతతి సిక్కు యువకుడు గుర్బాజ్ సింగ్ అందుకోసం అమెరికాకి బయలు దేరాడు.కొంత దూరం ప్రయాణించగానే పర్వతం శిఖరాగ్ర భాగానికి చేరుకున్న సమయంలో అక్కడ మంచు గడ్డపై కాలు మోపడంతో ఒక్కసారిగా అక్కడి నుంచీ కిందకి జారిపడిపోయాడు.
సుమారు 150 మీటర్ల ఎత్తైన కొండ కావడంతో అతడికి తీవ్రంగా గాయాలు అయ్యాయి.
దాంతో అతడు పడిపోయిన ప్రాంతానికి వెళ్ళడానికి అక్కడి రెస్క్యూ టీం కి సుమారు 4 గంటల సమయం పట్టినని మీడియా తెలిపింది.గాయాలతో ఉన్న అతడిని అక్కడి నుంచీ పర్వతం పై నుంచీ కిందకి తీసుకువచ్చి పోర్ట్ ల్యాండ్ లోని ఆసుపత్రికి తీసుకువెళ్ళారు.ప్రస్తుతం అక్కడి ఆసుపత్రిలో కోలుకుంటున్న గుర్బాజ్ త్వరలోనే మళ్ళీ అదే పర్వతాన్ని అధిరోహిస్తానంటున్నాడు….