వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే సుమారు 4 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా గ్రామ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి వారి ద్వారా గ్రామాల్లోని సమస్యలను తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి చేరువ అయ్యే విధంగా జగన్ వ్యవస్థను రూపొందించారు.ఇప్పటికే వారు సమర్థవంతంగా తమ విధులను నిర్వహిస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు చేదోడువాదోడుగా నిలుస్తున్నారు.
అయితే గ్రామ వాలంటీర్ల విషయంలో మొదటి నుంచి వైసిపి ప్రత్యర్థులు చిన్న చూపు చూస్తూ అవహేళన చేస్తూనే ఉన్నారు.
తాజాగా టిడిపి మాజీ నాయకుడు ప్రస్తుత బీజేపీ లీడర్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గ్రామ సచివాలయ ఉద్యోగులు వాలంటీర్ల పై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు.
సచివాలయాలు వార్డులు అంటూ ప్రతి గ్రామంలో 40 మంది దున్నపోతులను ప్రజలపైకి ముఖ్యమంత్రి జగన్ వదిలారని విమర్శించారు బైరెడ్డి.కర్నూలులో మీసేవ నిర్వాహకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న బైరెడ్డి ఈ విమర్శలు చేశారు.







