నారా లోకేష్ ఇక నుంచి దూకుడు పెంచాల్సి ఉంది.పసుపు దళాన్ని జోరుగా నడిపించాల్సిన సమయం వచ్చేసింది.
తండ్రి చంద్రబాబు కూడా చాలానే శ్రమిస్తున్నారు.ప్రస్థుతం లోకేష్ ఎమ్మెల్సీ కాబట్టి చట్ట సభల్లో ఉన్నారు.కానీ త్వరలోనే ఈ ముచ్చట కూడా ఇక తీరిపోనున్నది.2023 మార్చి నాటికి ఆయన సభ్యత్వం పూర్తి అవుతోంది.దాంతో మాజీ ట్యాగ్ లైన్ రానున్నది.కాగా మరోసారి కౌన్సిల్ లో అడుగు పెట్టడానికి టీడీపికి బలం లేదు.సార్వత్రిక ఎన్నికలు వస్తే పోటీ చేద్దామన్నా మరో ఏడాది పట్టేలా ఉంది.ప్రస్తుతం మంగల గిరి నుంచి పోటీ చేస్తారనె టాక్ ఉన్నది.
కాగా ఆయన్ని దెబ్బతీసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది.చేనేత సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి హనుమంతరావును ఎమ్మెల్సీగా వైసీపీ చేసే అవకాశం ఉంది.
హనుమంతరావు గతంలో ఎమ్మెల్యేగా ఇదే సీటు నుంచి గెలిచారు.ఒకవేళ ఆయన కాకపోయినా సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామ క్రిష్ణారెడ్డికి మద్దతుగా హనుమంతరావును రెడీ చేసి ఉంచారు.
ఇంకో వైపు నాన్ లోకల్ అన్న ముద్ర అయితే లోకేష్ కి ఉంటుంది.దాంతోపాటు సిట్టింగ్ లీడర్ చిరంజీవి వర్గం కూడా లోకేష్ పోటీ మీద గుర్రుగా ఉంది అంటున్నారు.
ఆయన తానే అభ్యర్ధి అనుకుంటే లోకేష్ పాదం మోపారట.ఈ పరిణామాలు ఇలా ఉండగా ఇపుడు వైసీపీ ఎంపీ విజయసాయిఎడ్డి లోకేష్ మీద చేసిన కామెంట్స్ అయితే మంట పుట్టిస్తున్నాయి.
కావాలనే లోకేష్‌ను మానసికంగా దెబ్బ తీయాలని వైసీపీ భావిస్తోంది.మరి వారి ట్రాప్ లో పడకుండా.
తన పని తాను చేసుకుంటూ భవిష్యత్ కోసం బంగారు బాటను వేసుకోవాల్సిన సమయం వచ్చేసింది.మాటలు పక్కన పెట్టేసి.
చేతల్లో చూపించుకోవాలి.మరి సరిగ్గా ఎన్నికలకు ముందు మాజీ ట్యాగ్ తో వెళ్లినా.
సరైన నియోజకవర్గంలో పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్తేనే పదవి దక్కుతుంది.మరోసారి పార్టీ అధికారంలోకి రాకపోయినా.
లోకేష్ తప్పక గెలవాల్సిన పరిస్థితులు అయితే కనపడుతున్నాయి.