సూపర్ స్టార్ కృష్ణ సినీ కెరీర్ లో ఎన్నో విజయాలు ఉన్నప్పటికీ అల్లూరి సీతారామరాజు సినిమా ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా రీమేక్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.
దాదాపుగా 50 సంవత్సరాల క్రితం విడుదలైన అల్లూరి సీతారామరాజు సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.మహేష్ బాబు సైతం పలు సందర్భాల్లో ఈ సినిమా గురించి పాజిటివ్ గా చెప్పారు.
సూపర్ స్టార్ కృష్ణకు మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమాలలో అల్లూరి సీతారామరాజు ఒకటి కాగా ఈ సినిమాలో కృష్ణ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతున్న నేపథ్యంలో మహేష్ బాబు ఈ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
వైరల్ అవుతున్న ఈ వార్తకు సంబంధించి మహేష్ బాబు నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
బాహుబలి సిరీస్ సినిమాలతో ప్రభాస్ కు, పుష్ప ది రైజ్ తో బన్నీకి పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు దక్కింది.

మహేష్ బాబు మాత్రం పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెట్టడం లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా మే నెలలో విడుదల కానుందని అధికారిక ప్రకటన వెలువడింది.త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమాకు దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ఒక సినిమాకు మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.