ముందు అనుకున్న టెంపర్ మూవీ క్లైమాక్స్ ఏంటో తెలుసా..?

ఎన్టీయార్ హీరో గా పూరిజగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన టెంపర్ మూవీ బాక్సఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.ఎన్టీయార్ అంతకు ముందు చేసిన సినిమాలు వరుసగా ప్లాప్ అవ్వడం తో ఎన్టీయార్ మార్కెట్ బాగా డౌన్ అయింది దాంతో పూరి తీసిన టెంపర్ మూవీ తో ఎన్టీఆర్ మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు టెంపర్ నుంచి ఆర్ ఆర్ ఆర్ వరకు ఒక్క ప్లాప్ లేకుండా వరుసగా 5 హిట్లు కొట్టి, ఇప్పుడు కొరటాల సినిమాతో మరో హిట్ కొట్టబోతున్నాడు…

 Do You Know What The Climax Of The Temper Movie Details , Vakkantham Vamshi ,-TeluguStop.com

ఇక ఇది ఇలా ఉంటె ఎన్టీయార్ ని ప్లాప్ ల నుంచి బయటికి తీసుకువచ్చిన టెంపర్ సినిమా కథను రాసింది వక్కంతం వంశీ.బేసిగ్గా పూరి సినిమాలకి తనే కథలు రాసుకుంటారు అలా కాదని ఎన్టీయార్ వక్కంతం వంశీ దగ్గర ఉన్న కథని పూరికి ఇప్పించి మరి ఈ టెంపర్ సినిమాని చేసారు…అయితే కథ వంశీ దే అయినప్పటికీ దాంట్లో కొన్ని మార్పులు పూరి చేసారు ఇక ఇది ఇలా ఉంటె ఈ సినిమా క్లైమాక్స్ విషయం లో ఏం చేద్దాం అని పూరి వంశీ ఇద్దరు డిస్కస్ చేసుకున్న తర్వాత కోర్ట్ సీన్ లో సీడీ మిస్ అవుతుంది రౌడీలని నిర్దోషులని కోర్ట్ తీర్పు ఇస్తుంది వాళ్ళు బయటికి వచ్చాక హీరో ఫైట్ చేసి వాళ్ళని చంపేస్తాడు.ఇలా పెడుదాం అని పూరి చెప్పాడట…ఇదంతా బాగానే ఉంది…

కానీ ఎందుకో అది వంశీ కి నచ్చలేదట రాత్రంతా కూర్చొని ఆలోచిస్తే వంశీ కి ఒక ఆలోచన వచ్చిందట హీరో కూడా రేప్ చేసానని లొంగిపోతాడు చివర్లో మళ్లీ వీడికి కేసు కి ఏం సంభందం లేదు అని తెలుస్తుంది.దాంతో జైలు లోనే ఫైట్ అనేది చేద్దాం అని అనుకొని పూరి గారితో చెప్పాడట దాంతో పూరి లేచి వంశీ ని హాగ్ చేసుకొని ఇది సూపర్ ఉంది ఇలాగే చేద్దాం అని చేశారట…అలా మొత్తానికి ఈ సినిమాతో ఎన్టీయార్ కి పూరి కి ఒక మంచి హిట్ సినిమా పడిందనే చెప్పాలి…

 Do You Know What The Climax Of The Temper Movie Details , Vakkantham Vamshi ,-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube