మామూలుగా సినిమా ఇండస్ట్రీలో కొంతమందికి ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ లో స్టార్ట్ సంపాదించుకుంటే మరి కొందరు ఇండస్ట్రీలో కొన్ని ఏళ్ల నుంచి సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన గుర్తింపు దక్కక అవకాశాలు లేక ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోతూ ఉంటారు.కొందరు ఓవర్‌నైట్‌లో స్టార్ హీరోయిన్గా మారితే, మరికొందరు జీవితాంతం కష్టపడినా హీరోయిన్గా సక్సెస్ సాధించలేకపోతుంటారు.అయితే పుష్కలంగా గ్లామర్, టాలెంట్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ.10 ఏళ్లుగా 15 డిజాస్టర్లతో ఫ్లాప్ హీరోయిన్గా నిలిచింది ఒక అందాల ముద్దుగుమ్మ.ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.ఆ హీరోయిన్ మరెవరో కాదు సన్నీలియోన్( Sunny Leone ).

2012 లో నటి, దర్శకురాలు పూజా భట్ దర్శకత్వంలో రూపొందిన జిస్మ్ 2 సినిమా( Jism 2 movie ) ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది.అప్పటి నుంచి ఇండియన్ సినీ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.ఇకపోతే సన్నీ లియోన్ సినిమా కెరీర్ విషయానికి వస్తే.

జాక్ పాట్, షూటౌట్ ఎట్ వడాల, రాగిణి ఎంఎంఎస్ 2 చిత్రాల్లో నటించింది.తమిళంలో వడాకర్రీ సినిమాతో అడుగుపెట్టింది.ఆ తర్వాత కరెంట్ తీగ సినిమాతో తెలుగులో కెరీర్ ప్రారంభించింది.
ఆ తర్వాత డీకే సినిమాతో కన్నడలోకి ప్రవేశించింది.ఆ తర్వాత లవ్ యూ ఆలియా కన్నడ సినిమాలో నటించింది.
అయితే ఆమెకు భారీ సక్సెస్ మాత్రం లభించలేదు.ఇక కెరీర్లో ఒడిదుడుకులుతో బాయ్స్( Boys ) అనే మరాఠీ సినిమా రంగంలోకి ప్రవేశించింది.

శ్రేష్ట బంగాళీ అనే బెంగాలీ సినిమా చేసింది.ఆ తర్వాత మళ్లీ పీఎస్వీ గరుడవేగ( PSV Garudavega ) అనే తెలుగు సినిమాలో నటించింది.చివరగా ఓ మై ఘోస్ట్, కెన్నడీ, థీ ఇవాన్ అనే చిత్రాల్లో నటించింది.అయితే ఆమెకు గుర్తింపు, సక్సెస్ పంచి పెట్టే సినిమాను ఆమె చేయలేకపోయింది.ఇదిలా ఉంటే , హిట్స్, ఫ్లాపులు అనే సంబంధం లేకుండా సన్నీలియోన్ చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి.మలయాళంలో రంగీలా అనే సినిమాలో, వీరమదేవీ, షేరో అనే తమిళ సినిమాల్లో, కోకా కోలా, హెలెన్, ది బాటిల్ ఆఫ్ భీమ కారేగావ్ అనే సినిమాల్లో నటిస్తున్నది.
అలాగే కన్నడలో యూఐ అనే సినిమాలో నటిస్తోంది.కాగా సన్నీలియోన్ నటించిన సినిమాలో ప్లాప్ అయినప్పటికీ ఈ మధ్యగుమ్మ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.