ఇండస్ట్రీ కి( Tollywood ) వచ్చే చాలా మంది సినిమాల్లో ఏదో ఒకటి చేయాలి మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ తో వస్తారు నిజానికి వీళ్ళకి అంత సీన్ ఉందా, లేదా అనేది ఎవరు ఆలోచించరు.అయితే ఇండస్ట్రీ కి కొందరు ఏదో ఊహించి వస్తారు కానీ ఇక్కడ దానికి మించినది జరుగుతూ ఉంటుంది అందుకే వాళ్ళు మళ్ళీ ఇండస్ట్రీ లో నుంచి వెళ్లిపోతుంటారు…
ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది సురేందర్ రెడ్డీ( Surendar reddy ) అనే చెప్పాలి ఆయన తీసిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి.అయితే ప్రస్తుతం ఆయన ప్లాపుల్లో ఉన్నా కూడా మళ్లీ ఒక మంచి సినిమాతో కంబ్యాక్ అయితే ఇస్తాడు అనే కాన్ఫిడెంట్ తో అందరూ ఉన్నారు ఇక ఇది ఇలా ఉంటే సురేందర్ రెడ్డి ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో హీరో అవుదాం అని అనుకున్నారట.అయితే అది వర్క్ ఔట్ అవ్వక ఆయన డైరెక్షన్ ఫీల్డ్ కి వచ్చి మంచి సినిమాలు తీసి మంచి డైరెక్టర్ గా కూడా నిరూపించుకున్నాడు…
ఇలా ఇండస్ట్రీ లో నటుడు అవ్వాలనుకుని డైరెక్టర్ అయిన వాళ్లలో సురేందర్ రెడ్డీ ఒకరు అయితే ఈయన చూడటానికి కూడా చాలా క్యూట్ గా ఉంటారు అందుకే ఆయన అలా హీరో అవుదాం అని అనుకొని ఉండచ్చు…ఇక రీసెంట్ గా ఆయన డైరెక్షన్ లో వచ్చిన ఎజెంట్ సినిమా( Agent ) ప్లాప్ అవ్వడం తో ప్రస్తుతం ఆయన ఒక స్టార్ హీరో తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.ఈ సినిమాతో ఆయన పాన్ ఇండియా లెవల్లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నట్టు గా తెలుస్తుంది.