డైరెక్టర్ హరీష్ శంకర్ అందరి ముందు అవమాన పరిచారు: ఆకాష్ పూరి

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న డైరెక్టర్ పూరి జగన్నాథ్ వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు ఆకాష్ పూరి.ఆకాష్ బాల నటుడిగా పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు పొందారు.

 Director Harish Shankar Insulted Me In Front Of Everyone By Akash Puri Directo-TeluguStop.com

అనంతరం ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇకపోతే ఈ నెల 24వ తేదీ ఆకాష్ పూరి నటించిన చోర్ బజార్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.

సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆకాష్ పూరి ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ క్రమంలోని అలీ ఎన్నో రకాల ప్రశ్నలు అడుగుతో ఆకాష్ నుంచి సమాధానాలు రాబట్టారు.ఈ క్రమంలోనే గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో హరీష్ శంకర్ నిన్ను ఎందుకు తిట్టారనీ అలీ ఆకాష్ ను ప్రశ్నించారు.

ఇక ఈ ప్రశ్నకు ఆకాశ్ సమాధానం చెబుతూ.ఆరోజు జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు.

Telugu Akash Puri, Harish Shankar, Gabbar Singh, Puri Jagandadh, Tollywood-Movie

గబ్బర్ సింగ్ సినిమాలో ట్రాక్టర్‌ మీదెక్కి ‘ఇవాళ మీరు పెద్దోళ్లు.నేను చిన్నవాడిని.పెద్దయ్యాక నేను పారిపోను.పరిగెత్తిస్తా.’అనే డైలాగ్ చాలా గట్టిగా గంభీరంగా చెప్పాలి.నేను ఆ డైలాగ్ చాలా నెమ్మదిగా సింపుల్ గా చెప్పడంతో హరీష్ శంకర్ ఏంట్రా గట్టిగా అరవడం రాదా?అని అని చాలా గట్టిగా అరిచారు.ఆయన అలా మాట్లాడేసరికి చాలా కోపం వచ్చి ఎంతో గట్టిగా ఆ డైలాగ్ చెప్పాను.ఈ విధంగా డైలాగ్స్ చెప్పే సరికి ఇది కావాలి నాకు అంటూ హరీష్ శంకర్ వెళ్లిపోయారు.

ఆ రోజు అలా అనడంతో అవమానంగా ఫీల్ అయ్యాను కానీ ఆయన తిట్టడం నాకు ఎంతో సహాయ పడిందని ఈ సందర్భంగా ఆకాష్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటన గుర్తు చేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube