1999వ సంవత్సరంలో దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వం వహించిన “సమరసింహా రెడ్డి” చిత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు రికార్డులను సృష్టించింది.
ఈ చిత్రంలో హీరోగా నందమూరి నటసింహం లెజెండ్ బాలకృష్ణ నటించగా బాలయ్య బాబు సరసన అంజలా జవేరి, సిమ్రాన్ హీరోయిన్లుగా నటించారు.అయితే అప్పట్లో ఈ చిత్రం బాలయ్య బాబు కెరీర్ లోనే మంచి హిట్ గా నిలిచింది.
అంతేగాక రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ చిత్రం బిసి సెంటర్లలో 100 రోజులకు పైగా ఆడి కలెక్షన్ల సునామి సృష్టించింది.
అయితే సమరసింహారెడ్డి చిత్రానికి దర్శకత్వం వహించిన టువంటి దర్శకుడు బి.గోపాల్ ఈ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.అంతేకాక ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి కథను కూడా రెడీ చేసుకుని బాలయ్య బాబుకి వినిపించినట్లు తెలుస్తోంది.
అయితే కథనంలో కొన్ని మార్పులు చేయాల్సిందిగా దర్శకుడు బి.గోపాల్ కి బాలయ్య బాబు సూచించడంతో బి.గోపాల్ ఆ పనిలో నిమగ్నమైనట్లు సమాచారం.

అయితే ప్రస్తుతం బాలయ్య బాబు ఇతర చిత్రాల షూటింగ్లతో బిజీగా ఉండటంతో ఈ చిత్రాన్ని ఆగస్టు నెల నుంచి పట్టా లెక్కించేందుకు దర్శకుడు బి.గోపాల్ సన్నాహాలు చేస్తున్నాడు.దీంతో ఈ విషయం తెలుసుకున్న బాలయ్య బాబు అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
అంతేగాక ఎన్నాళ్లకి బాలయ్య బాబుని ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఫ్యాక్షనిస్ట్ గా చూడబోతున్నామంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నటువంటి ఈ చిత్రంలో నటిస్తున్నాడు.
ఈ చిత్రంలో బాలయ్య బాబు సరసన మొదటి కథానాయికగా అందాల తార నయనతార నటిస్తుండగా రెండో కథానాయికగా తెలుగు భామ అంజలి నటిస్తోంది.ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే పలు కీలక సన్నివేశాలు చిత్రీకరణ కూడా పూర్తయినట్లు సమాచారం.