ఇప్పుడు అల్లు అర్జున్ అంటే ఓ స్టార్ హీరో.బాక్సాఫీస్ వద్ద మంచి హిట్స్ ఉన్నాయి, నటనకి వచ్చిన అవార్డ్స్ ఉన్నాయి, దేశవ్యాప్తంగా పాపులారిటి ఉంది, చేతినిండా సినిమాలు ఉన్నాయి మెరియు స్టయిలిష్ స్టార్ అనే బిరుదు కూడా ఉంది.
ఈ స్టయిలిష్ స్టార్ బిరుదు గురించి మాట్లాడుకోవాలంటే, బన్ని డ్రెస్సింగ్ స్టయిల్ కాని, హెయిర్ స్టయిల్ కాని, యువత మెచ్చేలా ఉంటుంది.అందుకే స్టయిలిష్ స్టార్ అని అంటారు.
కాని ఒకప్పుడు, అంటే గంగోత్రి సమయంలో అసలు అల్లు అర్జున్ హీరో ఏంటి అని అనుకున్న జనాలు లేకపోలేరు.అలా అనుకున్నవారిలో అగ్రనిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారట.
ఇటివలే ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యులో ఈ విషయాన్ని చెప్పారు దిల్ రాజు.ఒక ప్రేక్షకుడిగా గంగోత్రిలో బన్నిని చూసినప్పుడు ఈయన హీరో ఏంటి అని అనుకున్నానని, కాని ఆర్య సినిమా మొదలుపెట్టే టైమ్ కి అంతా మారిపోయిందని, అల్లు అర్జున్ చేసిన హార్డ్ వర్క్ వల్లే ఈరోజు తానూ ఈ స్థితిలో, సక్సెస్ తో ఉన్నాడని దిల్ రాజు చెప్పుకొచ్చారు.
ఒక నిర్మాత అయ్యుండి, ఒక హీరో గురించి ఇలా నిర్మొహమాటంగా ఓ అభిప్రాయాన్ని చెప్పారంటే, బన్ని-దిల్ రాజు మధ్య చాలా సాన్నిహిత్యం ఉంది తీరాలి కదండీ.ఇక ఈ ఇద్దరు ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో డిజే – దువ్వాడ జగన్నాథం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.