ఆ నిర్మాతపై మహేష్ భార్యకి కోపం వచ్చి సినిమా ఆపేసిందట

బ్రహ్మోత్సవం సినిమా తరువాత మహేష్ తో మరో అవకాశం కోసం చాలా ప్రయత్నించాడు నిర్మాత పివిపి.మొన్నటిదాకా మహేష్ తో మరో సినిమా ఉంటుందని ప్రకటించుకుంటూ తిరిగాడు ఆ నిర్మాత.

 Why Namrata Got Angry With Mahesh Babu’s Producer ?-TeluguStop.com

అదే వంశీ పైడిపల్లి సినిమా.కాని అనుకోకుండా ఆ సినిమా ఇప్పుడు దిల్ రాజు చేతిలోకి వెళ్లిందని అంటున్నారు.

దిల్ రాజు అడిగినందుకే ఇచ్చారా లేక పివిపిని వద్దని ఇచ్చారా ? రెండోదే నిజమని అంటున్నారు ఫిలింనగర్ జనాలు.

మీడియా ప్రపంచంలో చక్కర్లు కొడుతున్న కబుర్ల ప్రకారం, నిర్మాత పివిపి మహేష్ భార్య నమ్రతకి కోపం తెప్పించారట.

అందుకే మహేష్ భార్య స్వయంగా ఆ నిర్మాతని ప్రాజెక్టు నుంచి తీసేసిందని టాక్.ఇంతకీ నమ్రతకి కోపం ఎందుకు వచ్చినట్టు ?

మహేష్ బాబు అంటే పెద్ద సూపర్ స్టార్.ఆయనతో ఎవరైనా మర్యాదపూర్వకంగానే వ్యవహరిస్తారు.అలాగనే మహేష్ ఫోజు కొడతాడని కాదు.

అందరిని సర్ లేదా గారు అని కలిపి అని పిలవడమే మహేష్ కి ఉన్న అలవాటు.కాని అదేరకమైన మర్యాద అవతలివైపు నుంచి కూడా రావాలి కదా.అదే పివిపి నుంచి కరువైందట.మహేష్ చనువు ఇచ్చాడు కదా అని కొంచెం ఎగస్ట్రాగా బిహేవ్ చేసేసరికి, అది గమనించని నమ్రతకి కోపం వచ్చిందట.

దాంతో అక్కడికక్కడే ఆ ప్రొడ్యుసర్ ని కదడిగిపడేసి, సినిమా తీసుకెళ్ళి దిల్ రాజు చేతిలో పెట్టిందని బలమైన టాక్.అంతేగా, అలాంటి సమయంలో ఏ భార్యకి మాత్రం కోపం రాదు.

మరి ఆ నిర్మాత చేసిన తప్పుకి సారి చెప్పి మళ్ళీ మహేష్ తో సత్సంబంధాలు కలుపుకుంటాడో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube