ఎన్నో ఆశలతో సొంత అన్ననే వదులుకుని వైసీపీలోకి వెళ్లిన ఆ టీడీపీ కీలక నేత సోదరుడికి వైసీపీ పెద్ద బ్యాండ్ వేసిందన్న ప్రచారం విశాఖ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.విశాఖపట్నం జిల్లాలో నర్శీపట్నం మునిసిపాలిటీ మీద అందరి దృష్టి ఉంది.
ఇక్కడ గెలిచేది ఎవరు అన్న చర్చ కూడా సాగుతోంది.ఇక్కడ టీడీపీ సీనియర్ నేతగా ఉన్న మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఈ మునిసిపల్ ఎన్నికలనే తన చివరి ఎన్నికలుగా తీసుకుంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీకి దూరంగా ఉండడంతో పాటు తన కుమారుడు విజయ్‌కు నర్సీపట్నం సీటు ఇప్పించుకోవాలని చూస్తున్నాడు.
ఇదిలా ఉంటే గత ప్రభుత్వంలో మునిసిపల్ చైర్మన్ గా ఉన్న అయ్యన్న సోదరుడు సన్యాసి పాత్రుడు అన్నతో పాటు అన్న కుమారుడు విజయ్‌తో పొసగక పోవడంతో వైసీపీ కండువా కప్పుకన్నారు.
పార్టీ మారినందున తనకు మునిసిపల్ చైర్మన్ లేదా వైఎస్ చైర్మన్ పదవి వస్తుందని ఆయన కొండంత ఆశలు పెట్టుకున్నారు.అయితే నర్సీపట్నం మునిసిపల్ చైర్మన్ పదవిని ఎస్సీ మహిళకు రిజర్వ్ చేశారు.
ఇక్కడ ఎలాగైనా అయ్యన్నకు చెక్ పెట్టాలని ఆయన కుటుంబంలో చీలిక తీసుకువచ్చి మరీ ఆయన సోదరుడు సన్యాసిపాత్రుడును ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ తన వైపునకు తిప్పుకున్నారు.

అయితే ఇప్పుడు చైర్మన్ పదవి ఎస్సీ మహిళ అవ్వడం వెనక కూడా ప్రభుత్వమే ఇదంతా కావాలని చేస్తోందన్న సందేహాలు అక్కడ వ్యక్తం అవుతున్నాయి.తాను ఎంతో ఆశ పెట్టుకున్న పదవి కాస్తా ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో అయ్యన్న తమ్ముడు ఎటూ కాకుండా రాజకీయ అయోమయంలో పడ్డారని అంటున్నారు.నర్సీపట్నం పంచాయతీగా ఉన్నప్పటి నుంచే అయ్యన్న చేతుల్లో ఉంది.
ఇప్పుడు కుటుంబంలో చీలిక వచ్చింది.పైగా అయ్యన్న వదిన, సోదరుడు కుమారుడు కూడా కౌన్సెలర్లుగా పోటీ చేస్తున్నారు.
అయ్యన్న సోదరుడు కనీసం మునిసిపల్ వైస్ చైర్మన్ అయినా ఇవ్వాలని కోరుతున్నారట.అయినా ఎమ్మెల్యే గణేష్ ఆ పదవికి కూడా మెలిక పెట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు.అదే జరిగితే అయ్యన్న సోదరుడికి అధికార పార్టీ బ్యాండ్ వేసినట్టే అవుతుంది.