యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్(Jr Ntr) నటించిన దేవర (devara)అక్టోబర్ నెల 10వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమా రిలీజ్ డేట్ చాలా కాలం క్రితమే ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు పోటీగా మరే సినిమా విడుదల కాదని అభిమానులు భావించారు.అయితే ఎవరూ ఊహించని విధంగా రజనీకాంత్(Rajinikanth) నటించిన వేట్టయాన్(Vettayan) మూవీ కూడా అదే తేదీన విడుదల కానుందని క్లారిటీ వచ్చేసింది.

ఎన్టీఆర్ దేవరకు రజనీకాంత్ సవాల్ విసరడం ఫిక్స్ అయిందని ప్రచారం జరుగుతుండటంతో ఇద్దరిలో విజేత జూనియర్ ఎన్టీఆర్ (Jr Ntr )అవుతారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మరి దేవర, వేట్టయాన్ (Devara, Vettayan)సినిమాలలో ఏ సినిమా పైచేయి సాధిస్తుందో చూడాల్సి ఉంది.ఈ రెండు సినిమాల బడ్జెట్ 500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం అని సమాచారం అందుతోంది.ఈ రెండు సినిమాలకు బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతోంది.
జూనియర్ ఎన్టీఆర్, రజనీకాంత్ లలో ఎవరినీ తక్కువగా అంచనా వేయలేమని ఇద్దరిలో ఎవరి క్రేజ్ వాళ్లకు ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఈ సినిమాలలో రెండు సినిమాలు సక్సెస్ సాధించాలని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
అటు దేవర, ఇటు వేట్టయాన్ సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా విడుదలవుతూ ఉండటం గమనార్హం.

దేవర, వేట్టయాన్ సినిమాలు దసరా పండుగ (Dussehra festival)సీజన్ ను క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నాయి.రజనీకాంత్ సైతం జైలర్ తర్వాత వరుస విజయాలను సొంతం చేసుకునేలా కెరీర్ ను ప్లాన్ చేసుకోవడం జరిగింది.సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్, రేంజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతున్నాయి.
దేవర, వేట్టయాన్ సినిమాలలో యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉండనున్నాయని తెలుస్తోంది.దేవర సినిమాలో సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan) కీలక పాత్రలో నటిస్తుండగా వేట్టయాన్ సినిమాలో రానా కీ రోల్ లో నటిస్తున్నారు.