భారత సంతతి వ్యక్తులు విదేశాలలోని చట్టసభలలో ఉన్నతమైన పదవులు అధిరోహిస్తూ చరిత్ర సృష్టిస్తున్నారు.తాజాగా అమెరికా సుప్రీం కోర్టు జడ్జిగా భారత సంతతి వ్యక్తి అయిన అమూల్ థాపర్ పేరు ట్రంప్ పరిశీలనలో ఉందన్న విషయం తెలిసింది.
తప్పకుండా అమూల్ థాపర్ నే ఈ పదవి వరిస్తుందని లోకల్ చానెల్స్ కూడా ప్రచారం చేశాయి.అయితే ఇప్పుడు తాజాగా
సింగపూర్ లో భారత సంతతికి చెందినా ప్రముఖ న్యాయవాది దేదర్ సింగ్ గిల్ సింగపూర్ సుప్రీంకోర్టు జ్యుడీషియల్ కమిషనర్‌గా నియమితులయ్యారు…ఆయనకీ 59ఏళ్ళు .అక్కడ చట్టసభలలో ఎంతో ఉన్నతమైన పదవులు అధిరోచించిన గిల్ సింగపూర్ ప్రభుత్వానికి ఎంతో నమ్మకస్తుడిగా పేరు సంపాదించుకున్నారు.అయితే గిల్ ని ఈ పదవిలో నియమించింది మాత్రం సింగపూర్ అధ్యక్షుడు హలీమా యాకోబ్.
అ.అయితే
ఆగస్టు 3న గిల్ బాధ్యత ఈ నూతన భాద్యతలని స్వీకరిస్తారని.ఈ పదవీ కాలం రెండేళ్లుగా ప్రధాని కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.సింగపూర్ జాతీయ వర్సిటీ పట్టభద్రుడైన గిల్‌కు న్యాయవాదిగా 30 ఏళ్ల అనుభవం ఉంది.
కార్పొరేట్ సంస్థల ఆస్తి కేసులను వాదించడంలో ఆయన ఖ్యాతి గడించారు…ఎంతో ఉన్నతమైన హోదాలో ఉన్న గిల్ ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తూ ప్రజలకి ఎంతో దగ్గరగా ఉండేవారని సింగపూర్ ప్రధాన పత్రిక పేర్కొంది.