తెలంగాణా రాష్ట్రం వరంగల్ జిల్లాకి చెందినా సుజాత గిడ్లా.కెనడియన్ మిషనరీల సాయంతో చదువుకున్నారు.
ఆతరువాత వరంగల్ ప్రాంతీయ ఇంజనీరింగ్ కాలేజీలో ఆమె ఫిజిక్స్‌లో మాస్టర్స్ ప్రో గ్రాం చేశారు.ఆమె చడువునే సమయంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా మూడు నెలలు జైలు శిక్ష అనుభవించారు.
ఆ సమయంలో ఆమెకి క్షయ వ్యాధి సోకడంతో పౌర హక్కుల న్యాయవాది సాయంతో విడుదలయ్యారు.ఆ తరువాత కొంతకాలానికి ఆమె మద్రాస్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అప్లైడ్ ఫిజిక్స్‌లో పరిశోధకురాలిగా పనిచేశారు.1990లో అమెరికా వెళ్లి స్థిరపడ్డారు.
అయితే ఆమె మంచి రచయిత్రి కూడా ఎన్నో రచనలు చేసిన ఆమె ‘యాంట్స్ అమాంగ్ ఎలిఫెంట్స్ , యాన్‌అన్‌టచబుల్ ఫ్యామిలీ అండ్ మేకింగ్ ఆఫ్ మోడ ర్న్ ఇండియా’ అనే పుస్తకాలని రచించారు.అయితే రచనలకి గాను సుజాత గిడ్లాకు ఈ ఏడాది ‘శక్తి భట్ మొదటి పుస్తకం’ పురస్కారం లభించింది.ఈ అవార్డు కు షార్ట్‌లిస్ట్ అయిన 6 పుస్తకాల్లో జడ్జీల ప్యానెల్ సుజాత పుస్తకాన్ని ఎంపిక చేసింది.
పేదల జీవితం, పితృస్వామ్య వ్యవస్థ, తిరుగుబాటు, కమ్యూనిజం తదితర సామాజిక అంశాల గురించి ఆమె ఇందులో వివరించారు.