ఐపీఎల్‌లో తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన వీరులు వీరే!

సాధారణంగా క్రికెట్ ప్రియులు ఐపీఎల్‌లో భారీ సిక్సర్లు, ఫోర్లు, సెంచరీలు, హాఫ్ సెంచరీలు ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు.నిజానికి బ్యాటర్లు ధనా ధన్ బ్యాటింగ్ చేస్తేనే క్రికెట్ లవర్స్ ఐపీఎల్‌ను బాగా ఎంజాయ్ చేయగలుగుతారు.

 Cricketers Fastest Half Centuries In Ipl Details, Ipl, Half Century, Sports Upd-TeluguStop.com

అయితే ఐపీఎల్‌ చరిత్రలో కొందరు బ్యాటర్లు వీరబాదుడు బాది అతి తక్కువ బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు.మరి ఆ టాప్‌ బ్యాట్స్‌మెన్‌ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

1.కేఎల్‌ రాహుల్‌

కేఎల్‌ రాహుల్‌ ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత ఫాస్ట్ గా హాఫ్ సెంచరీ చేశాడు.

ఈ యువ ప్లేయర్ కేవలం 14 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ బాదాడు.కేఎల్‌ రాహుల్‌ 2018లో పంజాబ్‌, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన ఒక మ్యాచ్‌లో ఈ ఫీట్ నెలకొల్పాడు.ఈ మ్యాచ్‌లో మొత్తం 16 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టి 51 పరుగులు చేశాడు.

2.యూసుఫ్‌ పఠాన్‌

2014 ఐపీఎల్‌లో మాజీ క్రికెటర్‌ యూసుఫ్‌ పఠాన్ కొట్టిన బౌండరీలను ఏ క్రికెట్ లవర్ మర్చిపోలేడు.కోల్‌కతా తరఫున ఆడిన ఈ విధ్వంసకర ప్లేయర్ సన్‌రైజర్స్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు.ఈ మ్యాచ్‌లో పఠాన్‌ 22 బంతుల్లో.5 ఫోర్లు, 7 సిక్సర్లు కొట్టి 72 పరుగుల స్కోరు సాధించాడు.

Telugu Cricketers, Ipl, Century, Ishan Kishan, Kl Rahul, Latest, Sunil, Suresh R

3.సునీల్‌ నరైన్‌

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఆల్‌రౌండర్‌ సునీల్‌ నరైన్‌ కూడా 15 బాల్స్ లో హాఫ్ సెంచరీ సాధించాడు.2017లో బెంగళూరుతో ఆడిన ఒక మ్యాచ్‌లో 17 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు సునీల్‌ నరైన్‌.

4.సురేశ్‌ రైనా

సురేశ్‌ రైనా 2014లో చెన్నై, పంజాబ్‌ మధ్య జరిగిన ఓ మ్యాచ్‌లో 16 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ బాదాడు.రైనా ఈ మ్యాచ్‌లో 25 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టి మొత్తం 87 పరుగులు చేశాడు.

Telugu Cricketers, Ipl, Century, Ishan Kishan, Kl Rahul, Latest, Sunil, Suresh R

5.ఇషాన్‌ కిషన్‌ వీర బాదుడు.

ముంబై బ్యాటర్ ఇషాన్‌ కిషన్‌ 2021లో సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 16 బంతుల్లోనే అర్థ శతకం చేశాడు.ఈ మ్యాచ్‌లో 32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టి 84 స్కోరు సాధించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube