చుండ్రు.దాదాపు అందరి ఇళ్లల్లో ఒక్కరైనా దీని బాధితులుగా ఉంటారు.అందులో ఎటువంటి సందేహం లేదు.చుండ్రు అనేది అనుకున్నంత చిన్న సమస్యేమి కాదు.దీనిని ఎంత నిర్లక్ష్యం చేస్తే అన్ని సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి.తలలో చుండ్రు ఉండటం వల్ల హెయిర్ ఫాల్ తీవ్రతరంగా మారుతుంది.
అలాగే తలలో దురద, చికాకు, జుట్టు పొడిబారడం, మొటిమలు వంటి రకరకాల సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.అందుకే వీలైనంత త్వరగా చుండ్రును నివారించుకోవడం కోసం రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు.
ఈ లిస్ట్ లో మీరు ఉన్నారా.? అయితే అస్సలు చింతించకండి.ఎందుకంటే, చుండ్రును వదిలించడంలో గుమ్మడి గింజలు అద్భుతంగా సహాయపడతాయి.వీటిలో ఉండే కొన్ని ప్రత్యేకమైన పోషకాలు చుండ్రును సమర్థవంగా వదిలించగలవు.మరి ఇంతకీ గుమ్మడి గింజలను ఎలా ఉపయోగిస్తే చుండ్రు పోతుందో తెలుసుకుందాం పదండీ.
ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు గుమ్మడి గింజలను వేసి లైట్‌గా ఫ్రై చేసుకోవాలి.
ఇలా ఫ్రై చేసుకున్న గుమ్మడి గింజలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల గుమ్మడి గింజల పొడి, వన్ టేబుల్ స్పూన్ పెరుగు, రెండు టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ కొకనట్ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి.