రాత్రి నుంచే స్టేడియం బయట ప్రేక్షకుల పడిగాపులు..స్టేడియం వద్ద సందడి వాతావరణం..!

నేడు వన్డే వరల్డ్ కప్ 2023 లో( World Cup 2023 ) భాగంగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా( India vs Australia ) మధ్య ఫైనల్ పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే.నేడు జరిగే మ్యాచ్ తో ప్రపంచ కప్ 2023 టోర్నీ ముగియనుంది.

 Cricket Fans Gather Outside Narendra Modi Stadium Ahead Of World Cup 2023 Final-TeluguStop.com

ఫైనల్ మ్యాచ్ చూసేందుకు క్రికెట్ ప్రేక్షకులు దేశంలోని నలుమూలల నుంచి అహ్మదాబాద్ కు చేరుకోవడంతో నరేంద్ర మోడీ స్టేడియం( Narendra Modi Stadium ) వద్ద సందడి నెలకొంది.రాత్రి నుంచే స్టేడియం బయట క్రికెట్ ప్రేక్షకులు పడిగాపులు గాశారు.

ప్రస్తుతం అహ్మదాబాద్ లో( Ahmedabad ) ఒక్కసారిగా ధరలన్నీ భారీగా పెరగాయి.దీంతో ఫైనల్ మ్యాచ్( Final Match ) చూడడానికి వచ్చిన వారు కనీసం హోటల్ లో బస చేయలేని పరిస్థితి ఏర్పడింది అనే వార్తలు వైరల్ అయ్యాయి.అందుకే చాలామంది ప్రేక్షకులు రాత్రంతా స్టేడియం బయటే ఉండడంతో మొత్తం సందడి వాతావరణం నెలకొంది.ప్రస్తుతం స్టేడియం బయట ప్రేక్షకులు పడిగాపులు కాస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఫ్యాన్స్ అందరూ కూడా స్టేడియం బయటనే ఉండడానికి ప్రధాన కారణం అక్కడ హోటల్స్ ధరలు ఆకాశాన్ని అంటాయి.

ఇక ఈ మ్యాచ్ వీక్షించేందుకు భారత దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకుల నుంచి సెలబ్రిటీల వరకు ఎంతోమంది హాజరు అవ్వనున్నారు.బీసీసీఐ( BCCI ) కూడా మ్యాచ్ ప్రారంభానికి ముందు అంగరంగ వైభవంగా ప్రపంచకప్ ముగింపు వేడుకలను నిర్వహించనుంది.ఈ టోర్నీలో భారత జట్టు లీగ్ దశ నుండి సెమీఫైనల్ వరకు ఓటమి అనేదే ఎరుగకుండా ఫైనల్ కు దూసుకు వచ్చింది.

భారత జట్టు లోని అందరూ ఆటగాళ్లు ఫుల్ ఫామ్ లోనే ఉన్నారు.మిస్ ఫీల్డ్ వల్ల అనవసర బౌండరీలు, క్యాచ్ మిస్ చేయడం లాంటి తప్పిదాలు జరుగక పోతే ఈ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ టైటిల్ భారత్ దే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube