చాలాకాలం తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాంధీభవన్ లో ఎంట్రీ ఇవ్వడం జరిగింది.ఈ క్రమంలో రేవంత్ రెడ్డితో పార్టీ బలోపేతానికి సంబంధించి అనేక విషయాలు చర్చించారు.
అనంతరం రాష్ట్ర ఇంచార్జ్ మానిక్ రావు థాక్రేతో భేటీ అయ్యారు.
దాదాపు ఇద్దరి మధ్య గంట పాటు సమావేశం జరిగింది.
అనంతరం మాట్లాడుతూ పార్టీలో చిన్న చిన్న బేధాభిప్రాయాలు సహజమే అని చెప్పుకొచ్చారు.తామంతా ప్రస్తుతం కలిసే ఉన్నామని వచ్చే ఎన్నికలలో పార్టీ విజయానికి కృషి చేస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే 50 స్థానాలలో కాంగ్రెస్ గెలవడం ఖాయమని స్పష్టం చేశారు.
ఇటీవల ఖమ్మంలో జరిగిన BRS సభకు 200 కోట్లు రూపాయలు ఖర్చు చేయటం జరిగింది.కాంగ్రెస్ పార్టీ 20 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అంతకుమించిన సభ నిర్వహిస్తుంది అని వ్యాఖ్యానించారు. చాలాకాలం తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ కావడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.