తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు( Assembly meetings ) జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ సమావేశాలలో అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష నేత కేసిఆర్ ( KCR )పై సీరియస్ వ్యాఖ్యలు చేస్తున్నారు.
కృష్ణా నదీ జలాలపై కీలక జరుగుతున్న సమయంలో కేసిఆర్ సభలో లేకపోవడం తెలంగాణ సమాజాన్ని అవమానించడమే అంటూ సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy )విమర్శించారు.ఇలాంటి పరిస్థితులలో ఆయన ఫామ్ హౌస్ లో ఉండటం కరెక్ట్ కాదని అన్నారు.
తెలంగాణ సమాజానికి నీళ్ళు ప్రాణ ప్రదమని దక్షిణ తెలంగాణ జిల్లాలకు అన్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు.
పరిస్తితి ఇలా ఉంటే అసెంబ్లీకి వస్తే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలపై కాంగ్రెస్ పార్టీ( Congress party ) నిలదీస్తుందనే భయంతోనే కేసీఆర్ సమావేశాలకు రావట్లేదని ప్రభుత్వ ప్రతినిధి మల్లు రవి( Mallu Ravi ) ఎద్దేవా చేశారు.‘ఆరోగ్యం సహకరించకపోతే కేసీఆర్ నల్గొండకు ఎలా వెళుతున్నారు? కృష్ణా నదీ జలాలపై అసెంబ్లీలో మాట్లాడితే రాష్ట్రం మొత్తం చూస్తుంది.నల్గొండకు వెళ్లి మాట్లాడటం ఎందుకు?’ అని ప్రశ్నించారు.ఆయన కాంగ్రెస్ కార్యాలయం గాంధీ భవన్ లో మాట్లాడారు.కృష్ణా నదీ జలాల విషయంలో అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ఈ సభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క( Bhatti Vikramarka ) కూడా గతంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలపై సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.