తాను బ్రతికినంత కాలం బూర్జువ భూస్వామ్య విదానాలకు , ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలపై తిరుగుబాటు జెండా ఎగరవేసి విప్లవ పంధావైపు నడిచిన గద్దర్( Gaddar ) అనేక వేలమంది విప్లవబాట వైపుకు మొగ్గు చూపడానికి ఇంధనం గా ఉపయోగపడ్డారు .నరాలు ఉప్పొంగించే అనేక విప్లవ గీతాలు ఆలపించి తెలంగాణ సాయుడ పోరాటాలకు తనవంతు సేవ చేశారు.
దాదాపు తన జీవితకాలమంతా అదే పంథా లో పయనించిన గద్దర్ తన చివరి రోజుల్లో మాత్రం ప్రజాస్వామ్య విదానా లపై కొంత ఆసక్తిని కనబరిచారు.అనేక పార్టీలలో పోటీకి ఆసక్తి చూపించినప్పటికీ తన చివరి మజిలీ లో మాత్రం కాంగ్రెస్ వైపు( Congress Party ) ఎక్కువగా నిలబడ్డారు.
![Telugu Brs, Cm Kcr, Congress, Gaddar, Gaddar Son, Rahul Gandhi, Revanth Reddy, T Telugu Brs, Cm Kcr, Congress, Gaddar, Gaddar Son, Rahul Gandhi, Revanth Reddy, T](https://telugustop.com/wp-content/uploads/2023/08/congress-party-to-use-gaddar-image-against-brs-detailsd.jpg)
ముఖ్యంగా ఆయన ఆఖరి సారిగా పాల్గొన సభ కూడా ఖమ్మంలో రాహుల్ గాంధీ( Rahul Gandhi ) సభ కావడం తో అందరికంటే ఎక్కువగా గద్దర్ ఇమేజ్ను తమ సొంతం చేసుకోవడానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణలో అధికార బారాస( BRS ) పార్టీని ఓడించాలని గద్దర్ కల కన్నారని ఆ కలను నెరవేర్చాలంటే కెసిఆర్ ను( KCR ) గగద్దే దింపాలంటూ కాంగ్రెస్ నేతలు పిలుపునిస్తున్నారు .అంతేకాకుండా గద్దర్ తనయుడికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో సీటు ఇచ్చే దిశగా కూడా కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది.మిగిలిన రాజకీయ పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్‌లో కొంత దళిత, బీసీల ప్రాతినిధ్యం అధికంగా ఉండటం, బలుగు బలహీన వర్గాలకు
![Telugu Brs, Cm Kcr, Congress, Gaddar, Gaddar Son, Rahul Gandhi, Revanth Reddy, T Telugu Brs, Cm Kcr, Congress, Gaddar, Gaddar Son, Rahul Gandhi, Revanth Reddy, T](https://telugustop.com/wp-content/uploads/2023/08/congress-party-to-use-gaddar-image-against-brs-detailss.jpg)
రాజకీయ అధికారం ఇచ్చే దిశలో కాంగ్రెస్ పార్టీ కొంత ముందు ఉండడం గద్దర్ కాంగ్రెస్ ను చివరి మజిలీగా ఎన్నుకున్నట్టుగా తెలుస్తుంది.బతికి ఉన్నా కూడా గద్దర్ కాంగ్రెస్‌కే మద్దతు ఇచ్చేవారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు దాంతో ఇప్పుడు గద్దర్ పై తెలంగాణ ప్రజానీకానికున్న గౌరవాన్ని అభిమానాన్ని తమ పార్టీకి ఓట్ల రూపంలో చూపించాలంటూ కాంగ్రెస్ కోరబోతున్నట్లుగా తెలుస్తుంది.మరి గద్దర్ గౌరవాన్ని ఖద్దర్ ఏ మేరకు “హస్త”గతం చేసుకుంటుందో చూడాలి
.