తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార వేగం పెంచింది.ఇందులో భాగంగా ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టనుంది.
ఈనెల 26, 27 తేదీల్లో పార్టీ కీలక నేతలు విస్తృతంగా పర్యటించి ప్రచారం చేయనున్నారు.ముందుగా 26న ఉమ్మడి వరంగల్ , ఉమ్మడి నల్గొండతో పాటు హైదరాబాద్ లో నేతలు పర్యటించనున్నారు.27న ఉమ్మడి రంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ తో పాటు నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు.ఈ రెండు రోజుల్లో మొత్తం 40 నియోజకవర్గాల్లో నేతలు పర్యటించనుండగా 10 మంది నేతలు రోజుకు రెండు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.