ఇటీవల కాలంలో సినిమా వేడుకలలో రాజకీయాల గురించి మాట్లాడటం ఎక్కువగా జరుగుతుంది.ఇలా సినిమా వేడుకలలో రాజకీయాలు గురించి మాట్లాడితే నష్టం సినిమాకే తప్ప రాజకీయ పార్టీలకు కాదని ఎన్నో సందర్భాలలో రుజువు అయినప్పటికీ కూడా పదేపదే ఇలా రాజకీయాల గురించి మాట్లాడుతూ సినిమాలను ఇబ్బందులలో పడేస్తున్నారు.
ప్రస్తుతం కమెడియన్ పృథ్విరాజ్ ( Pruthvi Raj ) చేసిన వ్యాఖ్యలు కూడా విశ్వక్ సేన్ ( Vishwak Sen ) లైలా సినిమాని( Laila Movie ) ఇబ్బందులలో పడేసాయని చెప్పాలి.ఈ సినిమా ఫిబ్రవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా కమెడియన్ పృథ్వీరాజ్ పరోక్షంగా వైసీపీ గురించి సెటైర్స్ వేయడంతో ఒక్కసారిగా వైకాపా( YCP ) అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాయికాట్ లైలా మూవీ( Boycott Laila Movie ) అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.ఇంతకీ ఈ వేడుకలు ఏం జరిగిందనే విషయానికి వస్తే ఈ కార్యక్రమంలో భాగంగా పృథ్విరాజ్ మాట్లాడుతూ సినిమాలో ఓ సన్నివేశాన్ని గురించి వివరించారు ఈ సినిమాలో ఓ సన్నివేశం ఉంటుందని మొదట్లో 150 గొర్రెలు ఉండగా చివరికి 11 మాత్రమే మిగిలి ఉన్నాయి అంటూ ఈయన మాట్లాడారు.

ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు కచ్చితంగా వైకాపాను ( YCP ) ఉద్దేశించే చేశారని ప్రస్తుతం వైసీపీలో 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలోనే ఈయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అంటూ వైకాపా ఫాన్స్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ సినిమాని బాయ్ కాట్ చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.గతంలో వైకాపా పార్టీలో ఉన్నటువంటి పృథ్విను కొన్ని కారణాలవల్ల పార్టీ సస్పెండ్ చేశారు.అప్పటినుంచి జనసేనకు సపోర్ట్ చేస్తున్న ఈయన కూటమి గెలుపుకు కూడా కృషి చేశారు.ఇక కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వత అవకాశం కల్పించుకొని మరి వైసీపీపై సెటైర్లు వేస్తూనే ఉన్నారు.
అయితే తాజాగా ఈయన చేసిన వ్యాఖ్యల కారణంగా సినిమా ఇబ్బందులలో పడిందని చెప్పాలి.