ఎన్నికలకు ముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా మరో పథకాన్ని అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) సిద్ధం అయింది.ఈ మేరకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) మరో పథకాన్ని ప్రారంభించనున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని( Bhadradri Kothagudem ) భద్రాచలం రాములవారి సాక్షిగా ‘ఇందిరమ్మ ఇళ్ల పథకం’ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా భద్రాచలం వస్తున్నారు.
దక్షిణ అయోధ్యగా పిలువబడుతున్న భద్రాద్రిలో రాములవారిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకోనున్నారు.

తరువాత లాంఛనంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని( Indiramma Houses Scheme ) ఆయన ప్రారంభిస్తారు.అనంతరం అధికారులతో కలిసి ఏజెన్సీ ప్రాంతాల్లో నిర్వహించే అభివృద్ధి పనులు, పోడు భూములు మరియు సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహించనున్నారు.అక్కడి నుంచి నేరుగా మణుగూరు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.
కాగా ఈ సభా వేదికగా లోక్ సభ ఎన్నికల శంఖారావాన్ని సీఎం రేవంత్ రెడ్డి పూరించనున్నారు.సీఎం పర్యటన నేపథ్యంలో అప్రమత్తం అయిన అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది.