మానవ శరీరంలో కొన్ని అనవసరమైన అంశాలు పేరుకుపోయి ఉంటాయి.వాటిలో యూరిక్ యాసిడ్ కూడా ఒకటి.
ఈ యూరిక్ యాసిడ్( Uric Acid ) శరీరంలోనీ వివిధ వ్యాధులకు కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ముఖ్యంగా యూరిక్ యాసిడ్ కిడ్నీలకు చాలా సమస్యను కలిగిస్తుంది.
శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువ కాలం పేరుకుపోవడం వల్ల మూత్ర పిండాలలో రాళ్లు( Kidney Stones ) ఏర్పడతాయి.వీటి అన్నిటికీ పరిష్కారం పొందాలంటే తమలపాకు ఉంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
అందుకే తమలపాకును క్రమం తప్పకుండా తింటే ఎన్ని లాభాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే తమలపాకులు ప్రేగుల ఆరోగ్యాన్ని రక్షించడంతో పాటు అపాన వాయువులను నివారిస్తాయి.
తమలపాకులు( Betel Leaves ) జీవక్రియను పెంచుతాయి.అలాగే రక్తప్రసరణ ను కూడా పెంచుతుంది.
అందువల్ల తమలపాకును ప్రతి రోజు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మంచిది.ముఖ్యంగా చెప్పాలంటే తమలపాకులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.ఇవి డయాబెటిక్ రోగులలో ఆక్సీకరణ ఒత్తిడిని దూరం చేస్తాయి.ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను( Blood Sugar Levels ) తగ్గిస్తుంది.ఇది యాంటీ డయాబెటిక్ ఏజెంట్ గా పనిచేస్తుంది.బీట్రూట్ ప్రోటీన్ కంటెంట్ ను పెంచుతుంది.
అలాగే గాయం నయం చేసే రేటు ను పెంచుతుంది.అలాగే ఇవి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.
ముఖ్యంగా కాలిన గాయాలు వేగంగా నయం అవుతాయి.తమలపాకులో యాంటిహిస్టామైన్ మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు బ్రోన్కైటిస్ ద్వారా గాలిని అడ్డంకి లేకుండా ప్రవహిస్తాయి.
దీని వల్ల ఆస్తమా వచ్చే అవకాశాలు దూరమవుతాయి.
తమలపాకులో ఒక సుగంధ ఫినోలిక్ సమ్మేళనం ఉంటుంది.దీనిని కాటెకోలమైన్ ఉద్దీపనగా పరిగణిస్తారు.ఈ హార్మోన్ డిప్రెషన్ లక్షణాల చికిత్సకు ఉపయోగపడుతుంది.
తమలపాకులోని విటమిన్ సి( Vitamin C ) జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
అలాగే తమలపాకు ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.