కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీతో నువ్వానేనా అన్నట్టుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.దేశంలో పరిస్థితి మారాలంటే బీజేపీ ని గద్దె దించాలని కేసిఆర్ తనదైన శైలిలో రాజకీయం చేస్తున్నారు.
దేశంలో యువత మేల్కొనాలి అని బీజేపీని తరిమేయాలని.దేశ భవిష్యత్తును కాపాడాలని ఇటీవల పిలుపునివ్వడం తెలిసిందే.
ఇక ఇదే సమయంలో బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టే పనిలో కూడా మరోపక్క కేసీఆర్ పని స్టార్ట్ చేయడం జరిగింది.
ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే తో ఆదివారం భేటీ కాబోతున్నారు.
గత కొద్ది రోజుల క్రితమే ఉద్ధవ్ సీఎం కేసీఆర్ కి ఫోన్ చేయటం లంచ్ కి ఆహ్వానించడం తెలిసిందే.దీనిలో భాగంగా ఆదివారం ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ముంబైకి కేసీఆర్ బయలుదేరనున్నారు.
మధ్యాహ్నం అక్కడ లంచ్ చేసి.జాతీయ రాజకీయాల గురించి చర్చించి మరింత మందిని కలుపుకునే వ్యూహాలు కార్యచరణ… విషయంలో మంతనాలు జరపనున్నట్లు తిరిగి రాత్రికి హైదరాబాద్ కి కేసీఆర్ చేరుకోనున్నారు.