తాజాగా ఎన్నికైన ఏపీ ఎన్జీవో సంఘం నూతన కార్యవర్గం. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ నీ కలవడం జరిగింది.
ఈ సందర్భంగా ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు.ఇతర కార్యవర్గ సభ్యులు సీఎం జగన్ కు శాలువా కప్పి పుష్పగుచ్చం అందించారు.
ఆ తర్వాత వివిధ అంశాలపై చర్చించడం జరిగింది.అనంతరం బండి శ్రీనివాసరావు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ఈ క్రమంలో సంక్రాంతికి డిఏ ఇస్తామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రికి మరోసారి గుర్తు చేసినట్లు స్పష్టం చేశారు.అది ఇటీవల సెలవులు వల్ల డిఏ చెల్లింపు సర్కులర్ ఇంకా ప్రాసెస్ కాలేదని వివరించడం జరిగింది.
ఈరోజు సర్క్యులర్ ప్రాసెస్ చేస్తామని సీఎంఓ అధికారులు తెలియజేసినట్లు పేర్కొన్నారు.ఇదే సమయంలో రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని.
ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.ఉద్యోగుల సమస్యల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే మాత్రం మరోసారి ఉద్యమానికి సిద్ధమని బండి శ్రీనివాసరావు మీడియా వద్ద సంచలన వ్యాఖ్యలు చేశారు.