కష్టాల సమయంలో మన ముందు ఉన్న ఏకైక దారి ఇదే.. చిరంజీవి కూతురి షాకింగ్ కామెంట్స్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) చిన్న కూతురు శ్రీజ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనే సంగతి తెలిసిందే.శ్రీజ సోషల్ మీడియాలో సైతం ఊహించని స్థాయిలో యాక్టివ్ గా ఉంటారు.

 Chiranjeevi Daughter Sreeja Post Goes Viral In Social Media Details Here Goes Vi-TeluguStop.com

శ్రీజ( Sreeja ) తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.విషయాలు నా నియంత్రణలో లేని సమయంలో పరిస్థితులు అస్తవ్యస్తంగా మారిన సమయంలో హృదయం గాయపడటంతో పాటు విరిగిపోతుందని ఆమె అన్నారు.

మనస్సు కలత చెంది ఆపై క్షీణిస్తుందని శ్రీజ చెప్పుకొచ్చారు.ఆ సమయంలో శరీరం అలసిపోయి బలహీనం అవుతుందని శ్రీజ అన్నారు.

లైఫ్ లో కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా మనస్సులో బాధ ఉన్నా గుండె బద్ధలైనా పరిస్థితి చేజారినా ఒక్కసారి కళ్లు మూసుకుని మన లోపలికి మనం వెళ్తే అన్నీ సెట్ అవుతాయని శ్రీజ కామెంట్లు చేశారు.కష్టాలు వచ్చిన సమయంలో మన ముందు ఉన్న ఏకైక దారి కూడా అదేనని ఆమె తెలిపారు.

ఈ పోస్ట్ కు కామెంట్లను శ్రీజ డిజేబుల్ చేయగా శ్రీజ అకస్మాత్తుగా ఇలాంటి పోస్ట్ చేయడం వెనుక కారణం ఏంటనే ప్రశ్నకు సంబంధించి సరైన జవాబు దొరకాల్సి ఉంది.జీవితంలో అన్నీ ఉంటాయని వాటిని స్వీకరించక తప్పదని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.వరుణ్ లావణ్య వివాహ వేడుకలో శ్రీజ తన పిల్లలతో కలిసి సందడి చేశారు.2016 సంవత్సరంలో శ్రీజ కళ్యాణ్ దేవ్ వివాహం జరిగింది.శ్రీజ రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకోనున్నారో చూడాల్సి ఉంది.శ్రీజ కూడా సినిమా రంగంపై దృష్టి పెడితే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

చిరంజీవి సపోర్ట్ చేస్తే శ్రీజ కెరీర్ విషయంలో మరింత ఎదిగే అవకాశాలు అయితే ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube