చెలియా మూవీ రివ్యూ

చిత్రం : చెలియా

 Cheliyaa Movie Review-TeluguStop.com

బ్యానర్ : మద్రాస్ టాకీస్

దర్శకత్వం : మణిరత్నం

నిర్మాతలు : మణిరత్నం

సంగీతం : ఏఅర్ రెహమాన్

విడుదల తేది : ఏప్రిల్ 7, 2017

నటీనటులు – కార్తి, అదితి రావు హైదరీ, ఆర్ జే బాలాజీ తదితరులు

లెజండరీ డైరెక్టర్ మణిరత్నం మునుపటి ఫామ్ లో లేరు.ఈమధ్య కాలంలో ఆయన సినిమాలేవి జనాల్ని ఆకట్టుకోలేదనే చెప్పాలి.

అలాగే కార్తీ కూడా కాష్మోరాతో ఓ పరాజయాన్ని అందుకున్నాడు.ఇక బాలివుడ్ లో అవకాశాలు లేక కేరీర్ ని నత్తనడకన నెట్టుకొస్తున్న అదితీరావు హైదరీకి చెలియా ఓ గొప్ప అవకాశం.ఈ ముగ్గురు తమ డల్ ఫేజ్ నుంచి బయటపడ్టారా? చెలియా అద్యంతం ఎలా సాగిందో రివ్యూలో చూడండి.

కథలోకి వెళితే :

1999 కార్గిల్ యుద్ధవాతావరణంలో సినిమా మొదలవుతుంది.భారత ఏయిర్ ఫోర్స్ అధికారి వరుణ్ (కార్తీ) ఊహించని ఓ ప్రమాదం మూలాన పాకిస్తాన్ సైనికులకి దొరికిపోతాడు.అతడిని పాకిస్తాన్ జైలుకి తీసుకెళ్ళిన శత్రు సైనికులు చిత్రవధ చేస్తుంటారు.

కాని వరుణ్ కి ఆ నొప్పి తెలియట్లేదు.తన గుండెని పిండేస్తున్న విషయం, తన ప్రేయసి లీలా అబ్రహాం (అదితి) తనకి దూరమవడం.

ఆమె ఇప్పుడు ఎక్కడుందో తెలియదు, ఎక్కడో పాకిస్తాన్ జైలునుంచి తప్పించికోని మళ్ళీ తన లీలని చూడగలడో లేదో తెలియదు.తను కనబడినా, తనతో జీవితాన్ని పంచుకునేందుకు అంగీకరిస్తుందో లేదో కూడా తెలియదు.

ఈ అగమ్యగోచర ప్రేమ జీవితానికి కారణం వరుణ్ ప్రవర్తన, తను చేసిన తప్పులే.ఆ కలహాలు ఏంటో, జైలులో బందీగా మారకముందు వరుణ్ తన లీలతో గడిపిన మధురక్షణాలు ఏంటో, వారిమధ్య కలహాలకి కారణాలేంటో, వరుణ్ – లీలా మళ్ళీ కలుసుకున్నారో లేదో తెర మీదే చూడాలి.

నటీనటులు నటన :

కార్తీ కెరీర్ లో ఇదో విభిన్న పాత్ర.క్లీన్ షేవ్ తో, ట్రెండిగా, క్లాస్ గా కార్తీ కనిపించడం బహుషా ఇదే మొదటిసారేమో.

తనకు అలవాటు లేని పాత్రైనా అవలీలగా పోషించాడు, మెప్పించాడు.నొచ్చుకున్న ప్రేయసికి క్షమాపణలు చెప్పే ప్రతి సన్నివేశంలో కార్తీ అద్భుతంగా నటించాడు.

కార్తి వాక్య ఉచ్చారణ కూడా అద్భుతంగా ఉంది.ఓ తమిళ నటుడు, తెలుగు కవిత్వాన్ని అంత అందంగా పలకడం మామూలు విషయం కాదు.

ఇక క్లయిమాక్స్ సన్నివేశం, అందులో కార్తీ నటన .తన కెరీర్ కొనసాగినంత కాలం గుర్తుండిపోతాయి.

అదితీ రావు ప్రతిభ కలిగిన నటి.ఆమె అందమైన కనులు చాలా మాట్లాడుతాయి.అందుకే మణిరత్నం ఆమె కెరీర్ ఎంత దిగువస్థాయిలో ఉన్నా, ఆమె ఇమేజ్ అనేదే పట్టించుకోకుండా ఈ సినిమాలో అవకాశమిచ్చారు.ఏదో హాట్ హాట్ ఫోటోషూట్లు, క్యారక్టర్ ఆర్టీస్టు పాత్రలు చేసుకుంటూ వచ్చిన అదితిని ఈ సినిమాలో ఓ శిల్పంలా చెక్కారు మణిరత్నం.

అమె పొగడ్తలకి అర్హురాలు.

మిగితా నటుల్లో ఎవరు మనకి తెలిసిన వారు కాదు.వారి పాత్రల పరిధిలో నటించారు.ఆర్జే బాలాజీ కామెడీ పాత్ర చేయకున్నా కొన్ని నవ్వులు పూయిస్తారు.

టెక్నికల్ డిపార్టుమెంటు :

రవి వర్మన్ సినిమాటోగ్రాఫి ఓ పుస్తకం.ఈ సినిమా చూస్తున్నంత సేపు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు.

ఫ్రెమింగ్, గ్రేడింగ్, లైటింగ్ .అన్నీ కుదిరాయి.కాశ్మీర్ అందాలు మరింత అందంగా కనిపించాయి.ఈ సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్ సినిమాటోగ్రాఫి.ఏఆర్ రెహమాన్ పాటలు బాగున్నాయి.తెర మీద అందంగా ఉన్నాయి.

కాని కథలో అవసరం లేని పాటలు కుడా ఉన్నాయి.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వినసొంపుగా ఉంది.

ఎడిటింగ్ డిపార్టుమెంటు ఒకటి రెండు పాటలు కట్ చేయాల్సింది.సెకండాఫ్ మీద మరో నెల వర్క్ చేయాల్సింది.నిర్మాణ విలువలు అత్యద్భుతం.

విశ్లేషణ :

ఓ యుద్ధ సన్నివేశం, ఆ తరువాత కారాగారం.విరహాన్ని భరించలేని ఓ ప్రేమికుడు.మెల్లిగా వాయిస్ ఓవర్ లో మణిరత్నం మార్కు భావనలు, కళ్ళెదుట ఆయనే తీయగల పోయెటిక్ షాట్స్.మంచి మూడ్ లోకి వెళ్ళిపోతాం.ఈసారి మణిరత్నం ఈజ్ బ్యాక్ అనుకుంటాం మనసులో.

కాని మన ఆశ నిరాశ అవడానికి ఎంతో సమయం పట్టదు.కథాబలం ఉండదు.

కేవలం చిత్రీకరణే మణిరత్నం స్టయిల్లో ఉంటుంది.కథానాయకుడు పాత్ర అర్థం కాదు.

లాజిక్ లేని కారణాలతో గొడవపడతాడు ఒక్కోసారి.హాస్పిటల్ సీన్ ఒకటి చూస్తే మీకే అర్థమయిపోతుంది.

అతికష్టంమీద ప్రేయసిని పెళ్ళికి ఒప్పించిన వరుణ్ తన పెళ్ళికి డుమ్మా కొడతాడు.రెండు రోజులు అతనికోసం ఎదురుచూస్తుంది ప్రేయసి.

వెనుక ఏదైనా బలమైన కారణం ఉంటుందేమో అనుకునేరు… ఈరోజు తన పెళ్ళి అని మరచిపోతాడు అంతే.అక్కడే ఆ క్యారక్టర్ కి డికనెక్ట్ అయిపోతాం.

ఇక మళ్ళీ కనెక్ట్ అవడం కష్టం.మనం ఏమోషనల్ అయ్యేంత ఎమోషన్ ఏమి పండదు వారిద్దరి మధ్య.

స్లో నరేషన్ మనల్ని కథకి మరింత దూరం చేస్తుంది.సెకండాఫ్ పూర్తిగా బోర్ కొట్టేస్తుంది.

పస లేని కథావస్తువు కాదు, కాని కథని నడిపించిన విధానంలో పస లేదు.రోజా, దళపతి, గీతాంజలి .దశాబ్దాలు గడిచినా, ఇప్పటి తరం దర్శకులు తీయలేని క్లాసిక్స్.ఎందుకో మణిరత్నం కూడా ఆ మెజిక్ ని రిక్రియేట్ ప్రయత్నాలు చేస్తున్నా, అవి సఫలం కావట్లేదు.క్లాస్ ప్రేక్షకులు మణిరత్నం టేకింగ్ కోసం ఓసారి చూడవచ్చు.

ప్లస్ పాయింట్స్ :

* కార్తీ, అదితి

* సినిమాటోగ్రాఫి

* క్లయిమాక్స్ సన్నివేశం

మైనస్ పాయింట్స్ :

* స్లో నరేషన్

* ఎంగేజింగ్ గా లేని కథనం

* హీరో పాత్రస్వభావంలో కన్ ఫ్యూజన్

చివరగా :

హీరో హీరోయిన్ పాస్ .మణిరత్నం ఫేయిల్.

తెలుగుస్టాప్ రేటింగ్ : 2.75/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube